నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు
ABN , Publish Date - May 22 , 2026 | 12:36 AM
రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పేర్కొన్నారు.
ఏసీపీ ప్రకాష్
హాజీపూర్, మే 21 (ఆంధ్రజ్యోతి) : రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పేర్కొన్నారు. గురువారం గుడిపేట గ్రామంలోని రైతు వేదిక లో నకిలీ విత్తనాల నియంత్రణపై విత్తనాలు, ఎరువుల డీలర్లకు అవ గాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడు తూ నకిలీ విత్తనాలు విక్రయిస్తే డీలర్లతో పాటు తయారీ కంపెనీలపై చర్యలుంటాయన్నారు. డీలర్లు షాపులకు సంబంధించిన లైసెన్స్‌ను క లిగి ఉండాలన్నారు. షాపులో ఉన్న స్టాక్‌ను రోజువారీగా నమోదు చే యడంతో పాటు విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులకు సం బంధించిన స్టాక్ రిజిష్టర్‌లు, బిల్లు బుక్‌లు తప్పనిసరిగా నిర్వహిం చాలని సూచించారు. విత్తనాలకు సంబంధించిన సోర్స్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచాలని, షాపులో ఉన్న సరుకు, స్టాక్ రిజిస్టర్‌ల మ ధ్య ఎలాంటి తేడాలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలుంటాయన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్టాక్ రిపోర్టును మండల వ్యవసాయాధికారి కా ర్యాలయానికి పంపించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి సురేఖ మా ట్లాడుతూ వచ్చే ఖరీఫ్ సీజన్‌లో దొడ్డు రకం సీడ్స్ డీలర్లు అమ్మ వద్ద న్నారు. రాష్ట్రంలో దొడ్డుబియ్యం తినే వారు తగ్గిపోయారని, ప్రభుత్వం సూచించిన సన్నరకం వరి విత్తనాలు మాత్రమే అమ్మాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.