ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:00 AM
ఎన్నికల విధుల్లో నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి మండల కేంద్రంలో ని ఎస్‌ఎం ఫంక్షన్‌హాలులో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పీవో, ఏపీ వోలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించా ల న్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుం డా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల విధుల్లో నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి మండల కేంద్రంలో ని ఎస్‌ఎం ఫంక్షన్‌హాలులో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పీవో, ఏపీ వోలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించా ల న్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుం డా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ అధికారుల కు కేంద్రాల్లో తాగునీరు, మూత్రశాలలు, లైటింగ్,ఫ్యాన్‌లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. పోలింగ్ రోజున ఓటిం గ్ సంబందిత ప్రతి నమూనాను పూర్తిగా నింపాలని, పోలింగ్ ని ర్వహణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అప్రమ త్తంగా ఉండాలన్నారు. ఈ నెల 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సంద ర్శించి నమోదైన పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.