Share News

రైతులను మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:23 PM

రైతులను మోసం చేసిన వ్యక్తులపై చ ట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాగర్‌క ర్నూల్‌ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడి, ఎస్‌ఐ శ్రీనివాస్‌రావుకు సూచించారు.

రైతులను మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలి
స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసరావుతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

- ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

తిమ్మాజిపేట, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి) : రైతులను మోసం చేసిన వ్యక్తులపై చ ట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాగర్‌క ర్నూల్‌ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడి, ఎస్‌ఐ శ్రీనివాస్‌రావుకు సూచించారు. మండల ప రిధిలోని అప్పాజీపల్లికి చెందిన చిలుక రాం రెడ్డి, మొగుదయ్య అనే రైతులు తాము పండించిన మొక్కజొన్న పంటను తమ అ వసరం రీత్యా దళారులను నమ్మి మోసపో యారు. సమయానిక డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుండడంతో వారు పోలీ స్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ఎమ్మెల్యే దృష్టికి తీ సుకెళ్లారు. శనివారం బాధితుల ఫిర్యాదు మేర కు మొక్కజొన్న పంట కొనుగోలు చేసిన వ్యక్తు లను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురాగా, అదే సమ యంలో నాగర్‌కర్నూల్‌ వెళ్తున్న ఎమ్మెల్యే కాసే పు పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆగారు. ఎస్‌ఐ ద్వా రా వివరాలు తెలుసుకుని, మోసగిస్తున్న దళా రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇందిర మహిళా శక్తి భవన్‌ పనుల పరిశీలన

కందనూలు, (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా ఇందిరా మహిళా శక్తి భవన్‌ నిర్మాణ ప నులను ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి శనివా రం పరిశీలించారు. పనుల పురోగతిపై అధికా రులను అడిగి తెలుసుకుని నాణ్యత ప్రమాణా లు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ తీగల సునేంద్ర, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలి : ఎమ్మెల్యే

తాడూరు, (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 22న పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క సిర్సవా డలోని దుందుభీ నది వద్ద హైలెవల్‌ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని స్థాని క ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి తెలిపారు. ఇం దుకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా ని ర్వహించాలని పంచాయతీరాజ్‌ అధికారులను ఆయన ఆదేశించారు. శనివారం సిర్సవాడ గ్రా మంలో వంతెన నిర్మించే నది తీర ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. వంతెననిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.20కోట్ల 20లక్షల నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ అధికారు లు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు యార రమే ష్‌, సింగిల్‌విండో చైర్మన్‌ రామచంద్రారెడ్డితో పా టు యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు వినోద్‌కు మార్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 11:23 PM