తిమ్మాజిపేట ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Aug 26 , 2026 | 11:17 PM
తిమ్మాజిపేట పోలీసు స్టేషన్‌లో ఆవంచ గ్రామానికి చెందిన పాలమూరు మహేందర్‌పై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణపై సమగ్ర విచారణ జరిపి ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌పై కఠిన చ ర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు.
- బాధితున్ని పరామర్శించిన బీఎస్పీ, కేవీపీఎస్ నాయకులు
నాగర్‌కర్నూల్ టౌన్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యో తి) : తిమ్మాజిపేట పోలీసు స్టేషన్‌లో ఆవంచ గ్రామానికి చెందిన పాలమూరు మహేందర్‌పై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణపై సమగ్ర విచారణ జరిపి ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌పై కఠిన చ ర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధి తుడు పాలమూరు మహేందర్‌ను బీఎస్పీ, కేవీ పీఎస్ నాయకులు వేర్వేరుగా పరామర్శించారు. పృథ్వీరాజ్ మాట్లాడుతూ విచారణ కోసం పోలీ సు స్టేషన్‌కు పిలిపించిన మహేందర్‌ను ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు విచక్షణారహితంగా కొట్టా రని బాధితు డు చెబుతు న్నాడన్నారు. ఎస్‌ఐ తనపై మూత్ర విస ర్జన చేశారని బా ధితుడు ఆరోపణ చే స్తున్న నేప థ్యంలో నిష్పక్ష పాతంగా విచారణ జరిపించాలని కోరారు. కేవీ పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ మాట్లాడు తూ ఘటనపై ఎస్పీ సమగ్ర విచరణ జరిపించి బా ధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసు స్టేషన్‌లో ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీ సుకోవాలని కోరారు. బీఎస్పీ నాయకులు కళ్యాణ్, బాలస్వామి, శ్రీహర్ష ముదిరాజ్, పరశురాములు, శంకర్, కేవీపీఎస్ నాయ కులు సత్యనారాయణ, సుల్తాన్, తారాసింగ్ తదితరులు పాల్గొన్నారు.