Share News

kumaram bheem asifabad- మున్సిపల్‌ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:00 PM

ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఇష్టారీతిన వ్యవహరిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్యపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ చైర్మెన్‌ మెంగ్రె ఆకాష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలోని తన చాంబర్‌లో శనివారం వైస్‌చైర్మెన్‌ ఎండి అహ్మద్‌, కౌన్సిలర్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

kumaram bheem asifabad-  మున్సిపల్‌ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి
మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మెన్‌ ఎండి అహ్మద్‌

ఆసిఫాబాద్‌,, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఇష్టారీతిన వ్యవహరిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్యపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ చైర్మెన్‌ మెంగ్రె ఆకాష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలోని తన చాంబర్‌లో శనివారం వైస్‌చైర్మెన్‌ ఎండి అహ్మద్‌, కౌన్సిలర్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆసిఫాబాద్‌ ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోవలక్ష్మిపై నమ్మకంతో బీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టారన్నారు. మున్సిపాలిటీని అభివృద్ది పర్చాలన్న ద్యేయంతో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌లు ముందుకు సాగుతున్న క్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అభివృద్దికి సహకరించడం లేదని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన కొంత మంది కౌన్సిలర్‌లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌లకు తెలియకుండా ఎలాంటి నోట్‌ఫైల్‌ లేకుండా బిల్లుల చెల్లిస్తున్నారని తెలిపారు. చెల్లింపుల విషయంపై వివరాలు అడిగితే మీకు చెప్పాల్సిన అవసరం లేదని అహంకార దోరణితో సమాధానం ఇస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ల వార్డుల్లో పారిశుధ్య పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ప్రజల్లో కౌన్సిలర్‌లకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో గ్రీన్‌ ప్లాంటేషన్‌ పేరిట మంజూరైన రూ. 20 నుండి 30 లక్షల నిధుల విషయంలో వివరాలు వెల్లడించడం లేదని, గుట్టు చప్పుడు కాకుండా చెల్లింపులు చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్‌ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని ఇదివరకే కలెక్టర్‌ దృష్టికి తీసుకవెళ్లడం జరిగిందన్నారు. మున్సిపల్‌ అభివృద్ధికి ఆటంకంగా వ్యవహరిస్తున్న కమిషనర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోఆరు. లేని పక్షంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. అనంతరం 16వ వార్డు కౌన్సిలర్‌ దూడల లక్ష్మి మాట్లాడుతు వార్డుల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ది, నిధుల మంజూరు, తదితర విషయంలో వివరాలను అడిగితే మున్పిపల్‌ కమీషనర్‌ కులం ప్రస్తావన ముందుకు తీసుకవచ్చి చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌లను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌లు చిలువేరు వెంకన్న, సాలం, తణుకు భార్గవి, నాగుబాయి, దూడల లక్ష్మి, జెబాషేక్‌లు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 11:00 PM