నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Apr 26 , 2026 | 10:44 PM
ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు డిమాండ్ చేశారు.
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్క్స్‌భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఎలాంటి నిబంధనలు పాటించ కుండా ఇష్టారాజ్యాంగా కొనసాగుతున్నాయన్నారు. వేసవి సెలవుల్లో అడ్మిష న్‌లు చేస్తే చర్యలుంటాయని ప్రభుత్వం సర్య్కూలర్ జారీ చేసినా ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యాంగా అడ్మిషన్‌లు చేస్తూ లక్షలాది రూపాయల ఫీజు లను ముందస్తుగానే వసూలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు ల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ప్రైవేటు పాటశాలల్లో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యాంగా కొనసా గుతున్న ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు సికిందర్, కార్తీక్, సంజయ్‌కుమార్, సౌమ్య, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.