Share News

kumaram bheem asifabad- సమావేశానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Nov 04 , 2026 | 10:11 PM

సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సర్పంచ్‌లు మూకుమ్మడిగా డిమాండ్‌ చేశారు. కెరమెరిలో బ్రుధవారం పత్యేక అధికారి వెంకట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు

kumaram bheem asifabad- సమావేశానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలి
మాట్లాడుతున్న మండల ప్రత్యేక అధికారి వెంకట్‌

కెరమెరి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సర్పంచ్‌లు మూకుమ్మడిగా డిమాండ్‌ చేశారు. కెరమెరిలో బ్రుధవారం పత్యేక అధికారి వెంకట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ గతంలో జరిగిన పలు సమావేశాల్లో ఈ విషయంపై సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నప్పటికీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ప్రత్యేక అధికారి, ఎంపీడీవో సముదాయించారు. తప్పకుండా చర్యలు తీసుకునేట్టు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందుగా వ్యవసాయా శాఖ అధికారి యుగేందర్‌ మాట్లాడుతూ ఎల్నీనో ప్రభావంతో వర్షా భావ పరిస్థితులు వల్ల కరువు మండలాల జాబితాలో మన మండలం లేనప్పటికీ అటవీ ప్రాంతాలు కలిగిన ఏరియాల్లో సర్వే చేయించి కరువు ప్రాంతంగా గుర్తించటానినకి అధికారులకు ప్రతిపాదనలు పంపించనున్నట్టు తెలిపారు. అటవీ శాఖ అధికారులు మాట్లాడుతుండగా పలువురు సర్పంచ్‌లు కలుగ జేసుకొని తమ గ్రామాల్లో అటవీ శాఖ రోడ్లకు ఇతరాత్ర పనులకు అటవీ శాఖ అధికారులకు గురి చేస్తున్నట్టు సభా దృష్టికి తెచ్చారు. ఏళ్లుగా తాము అక్కడే నివసిస్తున్నామని. మట్టిని రోడ్డును సైతం నిర్మించేందుకు అనుమతులు ఇవ్వడం లేదని పలువురు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. మండల ప్రత్యేక అధికారి వెంకట్‌ మాట్లాడుతూ డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో సబ్సిడీపై స్పింక్లర్లు, యంత్ర పరికరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వర్షా కాలం ప్రారంభంలో పత్తి విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అలాగే శనిగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఎంపీడీవో సాయిరాం గౌడ్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నీ గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చిన యాప్‌లో ప్రత్యేకతలను గుర్తించి వాటిని పొందుపరిచామని వివరించారు.. అలాగే ఇంటి పన్నుల వసూళ్లను వంద శాతం లక్ష్యంగా వసూలు చేయాలని చెప్పారు. ఏసీడీపీఓ ఖురేషి మాట్లాడుతూ అంగన్వాడీలోని ఖాళీలను భర్తి చేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో సర్పంచ్‌లు ఆత్రం లక్ష్మణ్‌రావు, తులసిరాం, ఆనంద్‌రావు, పుష్పలతరాథోడ్‌, ఆత్రం ఆనంద్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 10:11 PM