అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - May 24 , 2026 | 11:28 PM
ల్లా వ్యా ప్తంగా వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణపై చ ర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జి ల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ జిల్లా కలె క్టర్‌ను కోరారు.
- తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్
కోడేరు, మే 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యా ప్తంగా వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణపై చ ర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జి ల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ జిల్లా కలె క్టర్‌ను కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడే రులోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోని నిర్వాహ కులు రైతుల నుంచి ధాన్యం కాంటాలు చేసి వెంటనే రసీదులు ఇవ్వకుండా వడ్ల బస్తాలు మి ల్లులకు పంపిన తరువాత అక్కడ మిల్లర్లతో కు మ్మకై తరుగు పేరుతో క్వింటాల్‌కు మూడు కిలోల పైన తరుగు తీసి వేసిన తరువాత రైతుల కు రసీదులు ఇస్తున్నార ని, ఇదేం పద్ధతి అని ని ర్వాహకులను ప్రశ్నిస్తే మా దగ్గర రసీదు బు క్కులు లేవని, అందుకే ఇ వ్వడం లేదని సమాధానం ఇవ్వడంపై శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. తక్షణమే రసీదులు ఇవ్వకుంటే జిల్లా అధికా రులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఒక్క కొనుగోలు కేంద్రంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మకై తరు గు పేరుతో క్వింటాల్‌కు మూడు, నాలుగు కిలో లు కటింగ్ చేసిన తరువాత రైతులకు రసీదులు ఇస్తున్నారని అన్నారు. తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రతీ కొనుగోలు కేంద్రంలో రైతులకు తక్షణమే ఐకేపీ కొనుగోలు లేదా పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో రసీదు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు రాములు, వెంకటస్వామి, శ్రీనివాసులు, వెంకటమ్మ పాల్గొన్నారు.