ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు కార్యాచరణ
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:08 AM
ఎల్‌నినో ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్‌లు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాల యాల
జగిత్యాల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్‌లు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాల యాల సముదాయం (ఐడీఓసీ) సమావేశ మంది రంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లు మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎనిమిది నెలల నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశిం చారు. జగిత్యాల జిల్లాలో తక్కువ నష్టాలతో 2026 ఖరీఫ్ సీజన్‌ను పూర్తి చేసుకునే పరిస్థితి ఉందని, ఇతర జిల్లాలతో పోలిస్తే జగిత్యాల జిల్లాలో వర్షపాతం లోటు కూడా తక్కువగా ఉందని పేర్కొన్నారు. అయితే రానున్న ఎనిమిది నెలల్లో వర్షం పడకపో వచ్చనే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ), చెరువులు, ఇతర నీటి వనరుల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం కాపాడుకో వాలని స్పష్టం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ పంటలను సాధ్యమైనంత వరకు కాపాడేందుకు మండల స్థాయి అధికారులు, వ్యవసాయ అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. యాసం గి పంటల ప్రణాళికను ప్రస్తుత నీటి లభ్యతకు అనుగుణంగా పూర్తిగా సమీక్షించాలని ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి యాసంగి పంటలకు నీరు విడుదల చేసే అవకాశం లేదని స్పష్టం చేస్తూ, బోరు నీరు అందుబాటులో ఉన్నా వరి సాగుకు వెళ్లవద్దని రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నీటి కొరత ఏర్పడితే పంటలను చివరి వరకు కాపాడటం కష్టమవుతుందని, అందువల్ల తక్కువ నీటితో, తక్కువ కాలంలో చేతికొచ్చే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకునేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి మండలంలో అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించి, గ్రామాల వారీగా యాసంగి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. తాగునీరు, పశువుల నీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, రాబోయే రోజుల్లో పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా నీటి వనరులు, నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితిని మండలాల వారీగా అంచనా వేసి ప్రణాళికలను సవరించాలని ఆదేశించారు. ఉద్యాన పంటలు, కూరగాయల సాగును పెంచాలన్నారు. కోతుల సమస్య ఉన్న ప్రాం తాల్లో సౌర విద్యుత్‌తో పనిచేసే ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునే అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సౌర ఫెన్సింగ్‌కు కేంద్ర ప్రభు త్వం సబ్సిడీ అందిస్తున్న విషయాన్ని రైతులకు వివ రించాలని సూచించారు. ఆయిల్‌పామ్, కూరగాయల సాగును ప్రోత్సహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిళ్ల వాణి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి, వివిద శాఖల అధికారులు, తహసీల్దార్లు, వ్వయ సాయ అధికారులు పాల్గొన్నారు.