రెవెన్యూ అక్రమాలపై కదలిక...!
ABN , Publish Date - Nov 01 , 2026 | 10:05 PM
ప్రభుత్వ భూములకు అక్రమ పట్టాలు జారీ అయిన విషయంలో ‘రెవెన్యూ అధికారుల చేతివాటం’పై ఎట్టకేలకు అధికార యంత్రాంగంలో స్పందన వచ్చింది. విషయాన్ని ప్రతి ష్టాత్మకంగా తీసుకున్న సీసీఎల్‌ఏ తక్షణమే రిపోర్ట్ చే యాల్సిందిగా కలెక్టర్‌కు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన ట్లు విశ్వసనీయంగా తెలిసింది.
-విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీసీఎల్‌ఏ
-ఏడాదిన్నరగా సాగదీతపై చీఫ్ కమిషనర్ ఆగ్రహం
-తక్షణ రిపోర్ట్ చేయాల్సిందిగా కలెక్టర్‌కు ఆదేశాలు
-దండేపల్లి రెవెన్యూ అధికారుల్లో ఉరుకులు, పరుగులు
మంచిర్యాల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములకు అక్రమ పట్టాలు జారీ అయిన విషయంలో ‘రెవెన్యూ అధికారుల చేతివాటం’పై ఎట్టకేలకు అధికార యంత్రాంగంలో స్పందన వచ్చింది. విషయాన్ని ప్రతి ష్టాత్మకంగా తీసుకున్న సీసీఎల్‌ఏ తక్షణమే రిపోర్ట్ చే యాల్సిందిగా కలెక్టర్‌కు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన ట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కలెక్టర్ కుమార్ దీపక్ దండేపల్లి తహసీల్దార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి రెవెన్యూ సిబ్బంది పూర్తిస్థాయి వి చారణ కోసం ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఏ డాదిన్నర క్రితం విషయం వెలుగులోకి రాగా, అప్పటో ్లనే పూర్తిస్థాయి విచారణకు స్వయంగా ప్రభుత్వ భూ ప రిపాలనశాఖ అదనపు కార్యదర్శి, సీసీఎల్‌ఏతో పాటు కలెక్టర్, ఆర్డీవో ఆదేశించినాకిందిస్థాయి అధికా రుల్లో చలనం లేకపోవడం గమనార్హం. దండేపల్లి మం డలం అదుగుల పేటలో వెలుగు చూసిన ఘటనపై ’ప్ర భుత్వ భూములకు అక్రమ పట్టాలు’ శీర్షికన 2025 మా ర్చి 6న ’ఆంధ్రజ్యోతి’ జిల్లా అనుబంధంలో కథనం ప్ర చురితమైంది. దీనిపై స్పందించిన కలెక్టర్ కుమార్ దీప క్ పూర్తిస్థాయి విచారణ కోసం దండేపల్లి తహసీల్దార్ ను ఆదేశించారు. పోలీస్‌శాఖ ఇంటలిజెంట్ విభాగం కూడా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేధికను ప్ర భుత్వానికి అందజేసింది.
పుట్టుకొచ్చిన అక్రమ పట్టాలు....
అందుగులపేటలో సర్వే నెంబర్లు 9, 49లలోని ప్రభు త్వ భూముల పంపిణీ విషయమై అసైన్‌మెంట్ చట్టా న్ని తుంగలో తొక్కుతూ గ్రామానికి చెందిన కొందరి పే ర్లపై అక్రమ పట్టాలు పుట్టుకొచ్చాయి. అక్రమంగా రికా ర్డుల్లో నమోదు చేసిన మండల రెవెన్యూ అధికారులు వారి పేరిట పట్టాలు జారీ చేశారు. సర్వే నెంబర్ 9లో 28 ఎకరాలకు పట్టాలు పుట్టుకురాగా, సర్వే నెంబర్ 49లో మరో 27 ఎకరాలు ఇతరుల పేరిట పట్టాలుగా మారాయి. ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట లావు ణి పట్టాగా మార్చాలంటే అసైన్‌మెంట్ కమిటీ ఆమో దం ఉండాలి. రెవెన్యూ డివిజన్ పరిధిలో అసైన్‌మెంట్ రివిజన్ కమిటీ (ఏఆర్‌సీ) చైర్మన్‌గా నియోజకవర్గ ఎ మ్మెల్యే వ్యవహరిస్తుండగా, కన్వీనర్‌గా ఆర్డీవో, సభ్యుడి గా తహసీల్దార్ ఉంటారు. వారి ఆమోదంతో ఎలాంటి జీవనాధారం లేని నిరుపేద వర్గాలకు చెందిన ఎస్టీ, ఎస్టీ, బీసీ కులస్థులకు ప్రభుత్వ భూములను సాగు చే సుకునేందుకు అసైన్ చేసే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇందుకోసం ముందుగా గ్రామంలో అర్హులైన వారిని వివరాలు ప్రకటిస్తూ తీర్మాణం చేయాల్సి ఉం టుంది. ఆ తీర్మాణం ఆధారంగా అసైన్‌మెంట్ కమిటీ స మావేశం కావాల్సి ఉంటుంది. అసైన్‌మెంట్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన సమీక్ష సమా వేశం ఏర్పాటు చేసి, దరఖాస్తుదారుల అర్హతలను బట్టి భూములను అసైన్ చేస్తారు. జిల్లాలో చివరిసారిగా 2012-13లో అసైన్‌మెం ట్ కమిటీ సమావేశం జరిగింది. మంచిర్యాల అప్పటి ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి, కమి టీ చైర్మన్ హోదాలో ఏర్పాటు చేసిన సమావేశంలో అర్హ తగల 56 మంది భూములు లేని నిరుపేదలకు 48 ఎక రాలను అసైన్ చేస్తూ తీర్మాణం చేయగా, లావుణి పట్టా లు సైతం అందజేశారు. అనంతరం 2020లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ’ధరణి’ పోర్టల్ ప్రవేశపెట్టడంతో పై 56 మంది లబ్ధిదారులకు చెందిన పేర్లు అందులో అ ప్డేట్ కాలేదు. పైగా రెవెన్యూ (5వ పేజీ తరువాయి)
రికార్డుల్లో పార్ట్-బీ (వివా దాస్పద భూము లు) విభాగంలో నమోదయ్యాయి. దీంతో కొం దరు లబ్ధిదారులు ఓ ఆన్‌లైన్ సెంటర్ నిర్వాహ కుడి ద్వారా మ్యూటేషన్ చేసుకునేందుకు ప్ర యత్నించి నట్లు సమాచారం. అతను నిరాకరిం చడంతో అప్పటి మండల కార్యాలయంలోని ఓ కిందిస్థాయి అధికారి కలుగజేకొని లబ్ధిదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు (దాదాపు రూ. 15 లక్షల మేర) వసూలు చేసి 39 మం దికి 2022-24 మధ్య కాలంలో ఆన్‌లైన్‌లో ధర ణి పోర్టల్ ద్వారా మ్యూటేషన్ చేసినట్లు జిల్లా ఉన్నతాధికా రులు ప్రభుత్వానికి అందజేసిన రి పోర్టు ద్వారా తెలు స్తోంది. అసలు ఆ సమ యంలో ఏఆర్‌సీ సమావేశాలు జరుగకపోయినా 39 మందికి అక్రమంగా భూములను మ్యూటే షన్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అలా అక్రమంగా మ్యూటేషన్ పొందిన లబ్దిదారులు రైతు భరోసా పథకానికి ఎంపికకా గా, బ్యాంకు రుణాలు సైతం తీసుకుంటున్నారు. మిగతా 17 మంది మాత్రం ఆ అధికారికి డ బ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో వారి దర ఖాస్తులు మిస్ మ్యాచ్ పేరుతో రిజెక్ట్ చేశారు.
సీసీఎల్‌ఏ ఆదేశాలతో...
అందుగుల పేటలో ప్రభుత్వ భూములకు జారీ అ యిన లావుణి పట్టాలన్నీ తహసీల్దార్ పేరిట కావడం విశేషం. పట్టాలు జారీ అయిన సమయంలో విధుల్లో ఉన్న తహసీల్దార్‌కు సం బంధం లేకుండానే కిందిస్థాయి అధికారి ద్వారా లబ్ధిదారులకు పంపిణీ అయ్యాయి. జిల్లా అధికా రుల నివేదిక ఆధారంగా విషయాన్ని ప్రతి ష్టా త్మకంగా తీసుకున్న సీసీఎల్‌ఏ పూర్తి స్థాయి వి చారణకు ఆదేశించింది. 2025 మే నెలలో అ ప్పటి ప్రభుత్వ అదనపు కార్యదర్శి సరియైన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జూన్ నెలలో ఛీఫ్ క మిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇదే విష యమై విచారణ జరపాలని కలెక్టర్‌ను ఆదేశిం చారు. కలెక్టర్ సైతం విచారణకు ఆదేశిస్తూ జూ లై 8న ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేయడంతో ఆర్డీవో అదే నెల 11న దండేపల్లి తహసీల్దార్‌కు లేఖ రాస్తూ ఏడు రోజుల్లో నివేదిక అందజే యాలని ఆదేశించారు. అయితే ఏడాదిన్నర గడి చినా విచారణ ముందుకు సాగక పోవడంతో ఈ ఏడాది ఏప్రిల్ 22న ’రెవెన్యూ అక్రమాలపై విచారణ ఎప్పుడు..?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో మళ్లీ కథనం ప్రచురితమైంది. దీంతో ఇంటలి జెన్స్ నివేదిక అందుకున్న సీసీఎల్ ఛీఫ్ సెక్ర టరీ తక్షణమే రిపోర్ట్ చేయాలంటూ ఇటీవల క లెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై దండేపల్లి తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండేపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిం ది. దీంతో దండేపల్లి మండల రెవెన్యూ అధికా రులు ఉరుకులు, పరుగులతో విచారణ రిపో ర్ట్‌ను కలెక్టర్‌కు అందజేసే పనిలో నిమగ్నమ య్యారు. ఆంధ్రజ్యోతి కథనాలతో ఏకంగా ప్రభు త్వమే స్పందించినందున ఇక అక్రమార్కులపై చర్యలు తప్పవన్న చర్చ జిల్లాలో జోరుగా జరుగుతోంది.