Share News

kumaram bheem asifabad- పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

ABN , Publish Date - Feb 14 , 2026 | 10:06 PM

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఏసీఎంవో ఉద్దవ్‌ అన్నారు. మండల కేంద్రంలో గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శనివారం పదో తరగతి విద్యార్థులకు ప్రేరణాత్మక వక్త సుద్దిళ్ల రమేశ్‌ ద్వారా మోటివేషన్‌ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ఒక ప్రణాళిక ప్రకారం చదవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

kumaram bheem asifabad- పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
మాట్లాడుతున్న ఏసీఎంవో ఉద్దవ్‌

వాంకిడి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఏసీఎంవో ఉద్దవ్‌ అన్నారు. మండల కేంద్రంలో గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శనివారం పదో తరగతి విద్యార్థులకు ప్రేరణాత్మక వక్త సుద్దిళ్ల రమేశ్‌ ద్వారా మోటివేషన్‌ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ఒక ప్రణాళిక ప్రకారం చదవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సబ్జెక్టు నిపుణులచే తయారు చేసి ప్రశ్నాపత్రంపై అవగాహన కల్పించాలన్నారు. సులభంగా ఏ విధంగా ఉత్తీర్ణులు కావడం, అత్యధిక మార్కులు ఏ విధంగా సాధిం చాలనే అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యుడు నారాయణమూర్తి, సంక్షేమాధికారి మబంగాపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువును కష్టంగా కాకుండా ఇష్ట పడి చదవాలని ఎంఈవో సుభాష్‌, వాసవి క్లబ్‌ అధ్యక్షుడు ఉదయ్‌బా బు అన్నారు. వాసవి క్లబ్‌ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంవద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ, స్పూర్తిదాయకమైన తరగతులతో పాటు విషయ నిపుణులతో పాఠ్యాంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 13న ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవాలని చెప్పారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రణాళికతో సాగాలని సూచిం చారు. పరీక్షల సమయంలో విద్యార్థులు భయానికి గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రణాళికబద్ధంగా సాధన చేస్తే సులువుగా లక్ష్యం సాధించవచ్చని సూచించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్‌ సభ్యలు శ్రీనివాస్‌, వ్యక్తిత్వ వికాస నిపుణులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ప్రకాష్‌, మారుతి, సదాశివ్‌, రమేష్‌, లక్ష్మణ్‌, రాజేష్‌, విజేష్‌, హెచ్‌ఎం జనార్థన్‌, శ్రీనివాస్‌, శ్రీధర్‌, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 10:07 PM