Share News

kumaram bheem asifabad- పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

ABN , Publish Date - Jan 30 , 2026 | 10:48 PM

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలను శుక్రవారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

kumaram bheem asifabad- పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలను శుక్రవారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను సందర్శించి బోధన తీరుపై విద్యా ప్రమాణాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడానికి గల కారణాలను ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు 100 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. క్రమం తప్పకుండా పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని బడికి రప్పించాలన్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రణాళికలు రూపొందించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా సబ్జెక్టులలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మధ్యాహ్న భోజనం ఎలా అందిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం రుచికరమైన పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను, రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తూ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన బోధన అందించాలని తెలిపారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి వారిని మానసికంగా సిద్ధం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

బాలికలను చదివిద్దాం

ఆసిఫాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): బాలికలను ఎదుగనిద్దామని, వారిని చదివిద్దామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఐడీఓసీలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం నిర్వహించిన జాతీయ బాలల దినోత్సవంలో కలెక్టర్‌ కె హరిత అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సభ్యులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాలికలను రక్షించుకుందాం. వారిని చదివిద్దాం అని ఎదుగనిద్దామని వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల విద్య, వారి హక్కుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాయని చెప్పారు. అందులో భాగంగానే బేటీ బచావో- బేటీపడావో కార్యక్రమం చేపడుతుందని అన్నారు. బాలికల వేధిస్తే పోక్సో కేసులు నమోదు చేసి శిక్షలు విధించే అవకాశం ఉందన్నారు. బాలికలు తమకు లభించిన సౌకర్యాలను ఉపయోగించుకుని తమ బంగారు భవిష్యత్‌గా తీర్చిదిద్దుకో వాలన్నారు. విద్యతో పాటు తమకు తాము ఎంచుకున్న రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకటే శ్వర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మహేష్‌, జీసీడీవో శకుంతల, ఈఈ సిద్దిక్‌, గిరిజన క్రీడల, సంక్షేమాధికారి శంబు, జిల్లా మహిళా సాధికారత సమన్వయకర్త శారద, సభ్యులు రాణి, మమతా, సఖి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 10:49 PM