kumaram bheem asifabad-పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ABN , Publish Date - Jan 21 , 2026 | 10:17 PM
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా సన్నద్ధం చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. బుధవారం ఉదయం ప్రార్థన సమయానికి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు.
ఆసిఫాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా సన్నద్ధం చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. బుధవారం ఉదయం ప్రార్థన సమయానికి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ఉత్తమ ఫలితాల సాధన దిశగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని చెప్పారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విదయ అందించాలని ఉపాధ్యా యులకు సూచించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలుఉ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.