kumaram bheem asifabad- హత్య కేసులో నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Apr 07 , 2026 | 10:58 PM
తిర్యాణి మండలం పిట్టగూడ గ్రామానికి చెందిన హన్మంతరావ్‌ను హత్య చేసిన రాయిసిడం వినోద్‌కుమార్‌ను మంగళవారం గోలేటి ఎక్స్ రోడ్డు ఆటో స్టాండ్ వద్ద అరెస్టు చేశామని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు.
రెబ్బెన, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): తిర్యాణి మండలం పిట్టగూడ గ్రామానికి చెందిన హన్మంతరావ్‌ను హత్య చేసిన రాయిసిడం వినోద్‌కుమార్‌ను మంగళవారం గోలేటి ఎక్స్ రోడ్డు ఆటో స్టాండ్ వద్ద అరెస్టు చేశామని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. వినోద్, అతని కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలకు హన్మంతరావ్ మంత్రాలు చేస్తున్నాడని అనుమానించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ విషయమై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారన్నారు. ఇరువర్గాలకు శాంతి పాటించాలని సూచించినప్పటికీ వివాదం కొనసాగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబరు 1న పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న హన్మంతురావుపై వినోద్ తన ఇంటి ముందు గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. సంఘటన సమయంలో అక్కడే ఉన్న హన్మంతరావు భార్య బొజ్జుబాయిని కూడా హత్య చేస్తానని నిందితుడు బెదిరించగా ఆమె భయంతో అక్కడి నుంచి తప్పించుకున్నదన్నారు. హత్య అనంతరం హన్మంతరావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసపులు నిందితుడు వినోద్‌ను అరెస్టు చేయగా పోలీసు కస్టడీలో పెట్టారని అన్నారు. ఆ సమయంలో మూత్ర విసర్జన నిమిత్తం బయటకు వెళ్తానని చెప్పి విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని తోసి వేసి నిందితుడు పరారైనట్లు తెలిపారు. ఈ మేరకు రెబ్బెన పోలీసు స్టేషన్‌లో మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉండడంతోఎస్పీ నితికా పంత్ నిందితుడిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బుధవారం నిందితుడిని మళ్లీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం విచారణ జరిపి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలిస్తున్న ట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ, తిర్యాణి ఎస్సై వెంకటేష్, పోలీసు సిబ్బంది శ్రీనివాస్, విద్యాసాగర్, శ్రీనివాస్, దుర్గేంద్ర, సందీప్‌లను ఎస్పీ నితికా పంత్ అభినందిం చారు.