ఆర్డీవో నివాసం నుంచి రూ.10 లక్షలు స్వాధీనం
ABN , Publish Date - Apr 23 , 2026 | 05:10 AM
నారాయణపేట అర్డీవో రాంచందర్ ఐదు జనన ధ్రువీకరణ పత్రాల జారీ కోసం రూ. 25 వేల లంచం తీసుకొంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే.
ఏసీబీ తనిఖీల్లో నగదుతో పాటు ఆస్తిపత్రాల సీజ్
నారాయణపేట, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట అర్డీవో రాంచందర్ ఐదు జనన ధ్రువీకరణ పత్రాల జారీ కోసం రూ. 25 వేల లంచం తీసుకొంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఆయన నివాసంలో చేపట్టిన సోదాల్లో రూ. 10.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు మహబూబ్‌నగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ బుధవారం తెలిపారు. దీంతో పాటు మహబూబ్‌నగర్, జడ్చర్లలలో నాలుగు ఓపెన్‌ప్లాట్లు, భూత్పూర్‌లో 3.18 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.