Share News

DG Charu Sinha Applauds: ఏసీబీలో అధికారులు, సిబ్బందికి రివార్డులు

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:01 AM

తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో రివార్డు మేళా నిర్వహించారు. గడిచిన మూడు నెలల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులు, సిబ్బందిని ఏసీబీ డీజీ చారు సిన్హా అభినందించారు.

DG Charu Sinha Applauds: ఏసీబీలో అధికారులు, సిబ్బందికి రివార్డులు

  • వారి పనితీరు భేష్‌: డీజీ చారు సిన్హా

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో రివార్డు మేళా నిర్వహించారు. గడిచిన మూడు నెలల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులు, సిబ్బందిని ఏసీబీ డీజీ చారు సిన్హా అభినందించారు. ఏసీబీ పనితీరుపై డీజీ చారుసిన్హా బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులు, సిబ్బందిని అభినందించి రివార్డులు అందించారు. 2011 నుంచి 2025 వరకు చివరి మూడు నెలల్లో సాధించిన ప్రగతితో పోలిస్తే... 2025లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయన్నారు. అధికారుల, సిబ్బంది ఇదే స్ఫూర్తితో పని చేయాలని చారు సిన్హా పిలుపునిచ్చారు. 2025లో చివరి మూడు నెలల్లో 78 కేసులు నమోదు కాగా, అందులో ట్రాప్‌ కేసులు 39 ఉన్నాయన్నారు. అధికారులు, సిబ్బంది నిరంతర కృషి ఫలితంగానే ఏసీబీ పనితీరులో మెరుగుదల నమోదైందని డీజీ చారుసిన్హా తెలిపారు.

Updated Date - Jan 20 , 2026 | 02:01 AM