Share News

ఏసీబీకి చిక్కిన దేవరకొండ విద్యుత్‌ ఏడీఈ

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:07 AM

కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దేవరకొండ విద్యుత్‌ ఏడీఈ సైదులు చిక్కారు. పూర్తయిన పనులకు ...

 ఏసీబీకి చిక్కిన దేవరకొండ విద్యుత్‌ ఏడీఈ

దేవరకొండ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దేవరకొండ విద్యుత్‌ ఏడీఈ సైదులు చిక్కారు. పూర్తయిన పనులకు రూ.30 వేల కమిషన్‌ ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానన్న విద్యుత్‌ ఏడీఈ సైదులు తీరుపై ఓ కాంట్రాక్టర్‌.. ఏసీబీని ఆశ్రయించగా, వారి సూచన మేరకు గురువారం కాంట్రాక్టర్‌ రూ.30వేలు ఇస్తుండగా ఏడీఈని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated Date - Apr 17 , 2026 | 04:07 AM