Share News

పొదుపు లక్షల్లో.. ఆస్తులు కోట్లలో!

ABN , Publish Date - Jun 11 , 2026 | 05:01 AM

రహదారుల భవనాల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ మోహన్‌నాయక్‌ను బుధవారం ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌..

పొదుపు లక్షల్లో.. ఆస్తులు కోట్లలో!

  • ఇక్కడే దొరికిన మోహన్‌ నాయక్‌

  • ఏసీబీ విచారణలో కీలక అంశాల గుర్తింపు

హైదరాబాద్‌, సైదాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): రహదారుల భవనాల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ మోహన్‌నాయక్‌ను బుధవారం ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆర్‌అండ్‌బీలో 1995లో రీసెర్చ్‌ ఆఫీసర్‌గా చేరిన మోహన్‌ నాయక్‌ అంచెలంచెలుగా ఎదిగి చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయికి చేరుకున్నారు. ఏసీబీ కేసు నమోదు చేసే సమయానికి ఆయన ఆదాయం రూ.3.94 కోట్లు కాగా కుటుంబ ఖర్చులు రూ.3,89,56,712గా గుర్తించారు. అంటే ఆయనకు ఇక సేవింగ్స్‌ మిగిలినవి రూ.4,43,288 మాత్రమే. అయితే ప్రాథమిక విచారణలో ఆయన ఆస్తులను రూ.7,90,57,617గా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో సేవింగ్స్‌ మినహాయిస్తే రూ.7,86,14,329 ఆస్తులు ఆయన కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సుమారు మూడు దశాబ్దాల సర్వీసులో ఆయనకు చట్టబద్దంగా మిగలాల్సిన పొదుపుకన్నా రూ.7.86 కోట్ల ఆస్తులు సంపాదించడంతో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో ఆయన ఆదాయానికి మించి 177 రెట్లు అక్రమార్జనకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మంగళవారం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి దాదాపు రూ.200 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు.

Updated Date - Jun 11 , 2026 | 05:01 AM