నేడు పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:42 AM
రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ స్కూళ్ల మూసివేత నిర్ణయానికి నిరసనగా... మంగళవారం పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.జీవన్ తెలిపారు.
హైదరాబాద్ సిటీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ స్కూళ్ల మూసివేత నిర్ణయానికి నిరసనగా... మంగళవారం పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.జీవన్ తెలిపారు. ఈ బంద్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు సహకరించాలని కోరారు. నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ ఉచిత విద్యను దూరం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని, మూసివేత నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. ఒక పర్మిషన్‌పై పలు బ్రాంచులు నిర్వహిస్తున్న పైవ్రేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.