Share News

రైతన్నకు జలసిరి...

ABN , Publish Date - Aug 02 , 2026 | 11:33 PM

వర్షాభావ పరిస్థి తుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తాగు, సాగునీటికి తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభా వంతో సరైన వర్షాలు కురవక భూగర్భ జలాలు అడు గంటి పోతున్నాయి. భూగర్భ జలాలను కాపాడేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటకుంటల నిర్మాణా లకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎక్కడ నీ రు అక్కడే నిల్వ చేసే విధంగా చర్యలు చేపట్టింది.

రైతన్నకు జలసిరి...

-భూగర్భ జలాలను కాపాడేందుకు ఫారంపండ్స్‌ నిర్మాణాలు

-ఇంటికో ఇంకుడుగుంత...ఊరికో ఊటకుంట

-జిల్లాలో 400 ఫాంపాండ్స్‌ నిర్మాణాల లక్ష్యం

-అవసరం ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు

కాసిపేట, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : వర్షాభావ పరిస్థి తుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తాగు, సాగునీటికి తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభా వంతో సరైన వర్షాలు కురవక భూగర్భ జలాలు అడు గంటి పోతున్నాయి. భూగర్భ జలాలను కాపాడేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటకుంటల నిర్మాణా లకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎక్కడ నీ రు అక్కడే నిల్వ చేసే విధంగా చర్యలు చేపట్టింది. గత వారం నుంచి గుంతల తవ్వకాల కోసం ఆసక్తి గల రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నా రు. వీబీరామ్‌జీ ఉపాధి పథకం ద్వారా కావాల్సిన రైతు లకు గుంతలు తవ్వేందుకు పనులు వేగంగా జరుగు తున్నాయి. ప్రభుత్వం జలసిరి పథకం కింద జిల్లా వ్యాప్తంగా ఇంటికో ఇంకుడుగుంత, ఊరికో ఊట కుంట తో పాటు, పంటకు పంట కుంటలను ఏర్పాటు చేయ నుంది. రెండు విడతల్లో 400 గుంతల తవ్వకాలు చేసేం దుకు ప్రణాళికలు తయారు చేయగా ఆగస్టు మొదటి విడతలో 320 గుంటలను తవ్వేందుకు కూలీలను సిద్ధం చేస్తున్నారు. అడప దడపా కురిసిన వర్షాలకు వచ్చే నీ టి చినుకులు వాగుల్లోకి వెళ్లకుండా ప్రయత్నిస్తున్నారు. నీటి కుంటల తవ్వకాల పనుల్లో మహిళ స్వయం సహా యక సంఘాల పాత్ర క్రీయాశీలకంగా పనిచేయనుంది.

-జిల్లాలో లోటు వర్షపాతం

జిల్లాలో గడిచిన రెండు నెలల నుంచి తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెల 29 నాటికి 414.4 ఎం ఎం వర్షం కురవాల్సి ఉండగా రెండు రోజులుగా కురు స్తున్న వర్షాలకు 458.9 ఎంఎం వర్షపాతం నమోదైంది. కానీ మూడు రోజుల క్రితం 11 మండలాల్లో తీవ్ర లో టువర్షఫాతం నమోదు కాగా దండేపల్లి మండలంలో అతి తీవ్రలోటు వర్షపాతం నమోదైంది. కేవలం 6 మం డలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తు న్నప్పటికీ దండేపల్లి, కన్నెపల్లి, వేమనపల్లి, నెన్నెల, న స్పూర్‌ మండలాల్లో ఇప్పటికి లోటు వర్షపాతం నమో దైంది. వర్షభావ పరిస్థితులను అధిగమించి భవిష్యత్‌ తరాలకు నీటి కొరతను తీర్చేందుకు ప్రభుత్వం నీటి కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆసక్తి గల రై తుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ పనులను ప్రారం భిస్తున్నారు. ఈ ఏడాదిలో సగటున 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. గడిచిన ఏడాదితో పోల్చితే 12 మండలాల్లో భారీగా భూగర్భ జలాలు అడుగంటిపో యాయి. జూన్‌ మాసంలో భూగర్భ జలమట్టం భూమ ట్టానికి 9.46 మీటర్లకు పడిపోగా, జులైలో 10.35 మీటర్ల అడుగు భాగాన ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆగస్టు నాటికి 11.01 మీటర్ల అడుగు భాగాన నీటి మట్టం పడి పోయే అవకాశం అందని అధికారులు హెచ్చరిస్తున్నా రు. అందుకే వర్షం నీటిని ఒడిసి పట్టి నీటిని నిల్వ చే యాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నీటి కుంటల నిర్మా ణ పనులను అందుబాటులోకి తెచ్చింది.

-నిధులు మంజూరు ఇలా..

పంట కుంటల తవ్వకాలకు అవసరం అయ్యే కూలీ ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. భూమి ప రిమాణం, కుంట విస్తీర్ణం ఆధారంగా ఒక కుంట నిర్మా ణానికి రూ. 90 వేల నుంచి 2 లక్షల వరకు ఖర్చు చే స్తుంది. దీనికి సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వ మే మంజూరు చేస్తుంది. ఈ పథకం ద్వారా చిన్న స న్నకారు రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. లబ్ధిదారుడికి సొంత పొలం ఉం డాలి. 6ఇన్‌టూ4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 లేదా 3 మీటర్ల లోతు వరకు నీటి కుంటలను తవ్వుతారు. స్థాని క పరిస్థితులను బట్టి పరిమాణంలో మార్పులు రావ చ్చు. జిల్లా వ్యాప్తంగా 306 పెర్య్కులేషన్‌ ట్యాంకులు, 61,200 వ్యక్తిగత ఇంకుడుగుంతలు, 306 కమ్యూనిటీ సోక్‌పిట్స్‌, 306 బోర్‌వెల్‌ రీచార్జెస్‌, 400 ఫారఫండ్స్‌, 32 ఓపెన్‌వెల్స్‌, 306 మ్యాజిక్‌ డ్రేన్స్‌ మంజూరయ్యాయి. వీటి ద్వారా గ్రామాల్లో కూలీలకు ఉపాధి లభిస్తుంది. ఈ పనులు దాదాపు మూడు నెలల పాటు జరగనున్నాయి.

-రైతులకు ప్రయోజనం

వ్యవసాయ భూముల్లో నీటి గుంతలు (ఫారంపండ్స్‌) తవ్వడం ద్వారా వర్షం నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి. వర్షభావ పరిస్థి తుల్లో పంటలకు రక్షణగా తడులు లభిస్తాయి. చేపల పెంపకంతో పాటు గట్లపై కూరగాయలు సాగు చేసు కుంటే రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. పొలంలో తవ్విన గుంతల ద్వారా వర్షం నీరు వృధాగా పోకుండా భూమిలోకి చేరుతుంది. దీని వల్ల చుట్టు పక్కన ఉన్న బోర్లు, చెరువుల్లో నీటి మట్టం పెరుగుతుంది. కరెంటు లేకపోయినా, బోరు మోటార్లు పాడైనా గుంతల్లో నిల్వ ఉన్న నీటిని పండ్ల తోటలతో పాటు అత్యవసర పంట లకు ఉపయోగించవచ్చు. గుంతల వద్ద చెట్లు నాట డం వల్ల పొలంగట్టు బలోపేతం అవుతుంది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడం వల్ల పదే పదే కొత్త బోర్లు వేసే ఖర్చు, విద్యుత్‌ బిల్లులు తగ్గుతాయి.

లక్ష్యం చేరేందుకు ప్రయత్నిస్తున్నాం -

కిషన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, మంచిర్యాల

నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు సమిష్టిగా పని చేస్తున్నాం. ఆగస్టు 15లోగా 320 ఫారంపండ్స్‌ నిర్మించేం దుకు అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రయ త్నాలు కొనసాగిస్తున్నాం. నీటి నిల్వలను పెంచడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. భవిష్యత్‌ తరా లకు నీటి కొరత లేకుండా ఉండేందుకు ఈ ఫారంపం డ్స్‌ ఎంతో ఉపయోగపడతాయి. అందరు కూడా ఇళ్లలో ఇంకుడుగుంతలు, సమీప వ్యవసాయ భూముల్లో ఫా రంపండ్స్‌ నిర్మించుకోవాలి.

Updated Date - Aug 02 , 2026 | 11:33 PM