Share News

‘అబోవ్‌ అండ్‌ బియాండ్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించిన జయేశ్‌ రంజన్‌

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:17 AM

విమానయాన రంగంపై పూర్తి అవగాహన కల్పిస్తూ రూపొందించిన ‘అబోవ్‌ అండ్‌ బియాండ్‌ ఎక్స్‌ప్లోరింగ్‌ ది అమేజింగ్‌ వరల్డ్‌ అఫ్‌ ఏవియేషన్‌...

‘అబోవ్‌ అండ్‌ బియాండ్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించిన జయేశ్‌ రంజన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): విమానయాన రంగంపై పూర్తి అవగాహన కల్పిస్తూ రూపొందించిన ‘అబోవ్‌ అండ్‌ బియాండ్‌: ఎక్స్‌ప్లోరింగ్‌ ది అమేజింగ్‌ వరల్డ్‌ అఫ్‌ ఏవియేషన్‌’ పుస్తకాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఆవిష్కరించారు. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో (సీఐఎస్ఎఫ్‌) దశాబ్దాల అనుభవం కలిగిన శివకుమార్‌ మోహంక ఈ పుస్తకాన్ని రాశారు. గురువారం డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయేశ్‌ రంజన్‌ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. విమానాశ్రయాల నిర్మాణం, రన్‌వేలు, లైటింగ్‌ సిస్టమ్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వంటి అంశాలను పుస్తకంలోరచయిత విపులంగా వివరించారు. అలాగే విమానాలకు బాంబు బెదిరింపులు, హైజాక్స్‌, స్మగ్లింగ్‌, మానవ అక్రమ రవాణా వంటి సవాళ్లను భద్రతా సిబ్బంది ఎలా ఎదుర్కొంటారో తెలిపారు. ఎలక్ట్రిక్‌, హైడ్రోజన్‌ విమానాలు, ఎయిర్‌ ట్యాక్సీల వంటి భవిష్యత్తులో వచ్చే మార్పులను కూడా పుస్తకంలో ప్రస్తావించారు. విమానయాన రంగంపై ఆసక్తి ఉన్న వారికి, ముఖ్యంగా విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 04:17 AM