Share News

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో ఎంపీ మల్లు రవి భేటీ

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:40 AM

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను ఆదివారం ఆయన నివాసంలో నాగర్‌ కర్నూల్‌ ఎంపీ మల్లు రవి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో ఎంపీ మల్లు రవి భేటీ

  • గంటపాటు వివిధ అంశాలపై చర్చ

హైదరాబాద్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను ఆదివారం ఆయన నివాసంలో నాగర్‌ కర్నూల్‌ ఎంపీ మల్లు రవి మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు గంటపాటు వారు సమావేశమయ్యారు. ఈ భేటీలో వివిధ అంశాలపై వారు చర్చించారు. గత పక్షం రోజులుగా రాష్ట్రంలో మీడియా, రాజకీయ, ప్రభుత్వ రంగాల్లో అపోహలు, విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్న నేపథ్యంలో తాను ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను కలిశానని మల్లు రవి చెప్పారు. ప్రభుత్వంపై వచ్చిన కొన్ని ఆరోపణలపై సర్కారు వివరణ ఇచ్చినప్పటికీ అపోహలు కొనసాగుతున్నాయని అన్నారు. అన్ని విషయాలపై రాధాకృష్ణతో చర్చించినట్లు రవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Jan 26 , 2026 | 03:40 AM