ఆరోగ్య శ్రీ సేవలు అంతంతే..!
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:50 PM
ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అర్హులైన పేద, మద్యతరగతి ప్రజలకు కార్పొరేట్ ఆసుప త్రుల్లో అధునాతన ఉచిత సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం చె బుతున్నప్పటికీ, జిల్లాలో పథకం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
-ముందుకురాని కార్పొరేట్ హాస్పిటల్స్
జిల్లాలో కుప్పలు తెప్పలుగా ప్రైవేట్ ఆసుపత్రులు
కేవలం నాలుగింటికే పరిమితమైన అనుమతులు
అధికారులు చొరవ తీసుకుంటే విస్తృతం అయ్యే ఛాన్స్
మంచిర్యాల, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అర్హులైన పేద, మద్యతరగతి ప్రజలకు కార్పొరేట్ ఆసుప త్రుల్లో అధునాతన ఉచిత సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం చె బుతున్నప్పటికీ, జిల్లాలో పథకం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్య మంత్రి డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మ కంగా ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య శ్రీ కార్డులు కూడా అంద జేశారు. ఆ కార్డుల ద్వారా ఎంపిక ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స లు అందనుండగా, బిల్లులకు సరిపడా నగదును ప్రభుత్వం ఆయా ఆసుపత్రుల నిర్వాహకులకు బ్యాంకుల్లో జమ చేస్తుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలవుతుండగా, మంచిర్యాల జిల్లాలో గ్రహణం పట్టిం ది. జిల్లాలో ఆరోగ్య శ్రీ సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు కనీసం 50 వరకు ఉన్నాయి. అయితే అందులో కేవలం నాలుగింటికి మాత్రమే ఆరోగ్య శ్రీ అనుమతులు ఉండటం గమనార్హం. అనుమతులు ఉన్న వాటిలో కూడా అరకొర గానే ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నట్లు రోగులు చెబుతున్నారు.
ముందుకు రాని యాజమాన్యాలు...
జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ప్రైవేటు ఆసుపత్రులు 200 పై చిలుకు ఉన్నాయి. వాటిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిం చేవి పదుల సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో మ ల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల పేరిట పెద్ద సంఖ్యలో బోర్డులు దర్శన మిస్తాయి. అయినా ఆరోగ్య శ్రీ సేవలు అందించేందుకు వాటి ని ర్వాహకులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుకారు తోంది. ఫలితంగా పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచిత వైద్య సేవలు అందడం లేదు. దీంతో ఆయా వర్గాల ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రు లను ఆశ్రయిస్తుండగా, ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉన్న కుటుంబా లు బిల్లులకు వెనుకాడకుండా మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లకు వెళు తున్నారు. కనీసం 50 పడకలు ఉన్న ప్రతీ మల్టీ స్పెషాలిటీ ఆసు పత్రికి ఆరోగ్య శ్రీ పథకం అనుమతులు పొందేందుకు అర్హత ఉం టుంది. అయితే ఆరోగ్య శ్రీ అనుమతులు పొంది లబ్ధిదారులకు చి కిత్స అందిస్తే ప్రభుత్వపరంగా బిల్లులు ఎప్పుడు అందుతాయో తె లియని పరిస్థితులు ఉండటంతో నిర్వాహకులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల కార్డులు...
జిల్లాలో 2 లక్షల పై చిలుకు ఆరోగ్య శ్రీ కార్డులు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెల్ల రేషన్ కార్డు దారులందరికీ ఆరో గ్య శ్రీ కార్డులు ఉన్నట్లే లెక్క. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 19 వేల 162 మందికి తెల్ల రేషన్ కార్డులు ఉండగా, వారందరికీ అను మతులు పొందిన ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు పొందేందుకు అవకాశం ఉంది. జిల్లా కేంధ్రంలోని మెడిలైఫ్, టచ్ మల్టీ స్పెషా లిటీ ఆసుపత్రులతోపాటు గణేష్ ఆర్థోపెడికి ఆసుపత్రి, అభయ్ కి డ్నీ సెంటర్‌లకు మాత్రమే ఇప్పటి వరకు ఆరోగ్య శ్రీ పథకం అ నుమతులు ఉండగా, లబ్ధిదారులకు ఆ విభాగంలో వైద్య సేవలు అందుతున్నాయి. పై నాలుగు ఆసుపత్రుల్లో వాటి స్పెషాలిటీని బ ట్టి ప్రస్తుతం ఆర్థో, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగంలో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి.
వైద్య సేవలు విస్తృతం అయ్యేనా...?
వాస్తవంగా ఆరోగ్య శ్రీ పథకం కింద మొత్తం 1835 రకాల వ్యా ధులకు చికిత్స అందాల్సి ఉంది. ఇందులో సాధారణ చికిత్స మొ దలుకొని ఆపరేషన్ల వరకు సేవలు అందుబాటులో ఉన్నాయి. జి ల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ముం దుకు వచ్చి, ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తే, ఆ విభాగంలో వై ద్య సేవలు మరింతగా విస్తృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ రోగ్య శ్రీ సేవల కోసం జిల్లా వాసులతోపాటు కొమరంభీం ఆసి ఫా బాద్ జిల్లాకు చెందిన లబ్ధిదారులు సైతం జిల్లా కేంద్రానికి వస్తుం టారు. కేవలం నాలుగు ఆసుపత్రుల్లో మాత్రమే ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో అర్హతగల ప్రజలు కొంతమే ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతా ధికారులు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చొరవతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్వాహకులను ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందిం చే లా కృషి చేయగలిగితే రెండు జిల్లాల్లోనిలబ్ధిదారులకు మరిన్ని ఉ చిత వైద్య సేవలు అందే అవకాశం ఉంది.