అన్ని రోజుల్లో ఆధార్ సేవలు
ABN , Publish Date - May 30 , 2026 | 03:41 AM
ఆధార్ సేవా కేంద్రాల్లో ఇక అన్ని రోజుల్లో ప్రజలకు సేవలు అందనున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఈ కేంద్రాలు మాదాపూర్...
హైదరాబాద్ సిటీ, మే29 (ఆంధ్రజ్యోతి): ఆధార్ సేవా కేంద్రాల్లో ఇక అన్ని రోజుల్లో ప్రజలకు సేవలు అందనున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఈ కేంద్రాలు మాదాపూర్, మూసారాంబాగ్‌లలో మాత్రమే ఉన్నాయి. వాటిల్లోనూ ఇప్పటి వరకు వారాంతాల్లో ఆధార్ నమోదు జరగడం లేదు. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సెలవు దినాల్లో మినహా అన్ని రోజుల్లోనూ సేవలందనున్నాయి. కాగా 18ఏళ్ల లోపు వారి కోసం అమీర్‌పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో ప్రత్యేక కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఈ కేంద్రాలకు ఆదివారాల్లో సెలవు ఉండగా.. వివిధ పనులు, ఉద్యోగాలు చేసుకునే వారు తమ ఆధార్ సమస్యలను పరిష్కరించుకోవాలంటే సెలవు పెట్టాల్సివస్తోందని నిర్వాహకుల దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఆధార్ సేవలను మరింత విస్తృతం చేయడానికి వారంతంలోనూ పనిచేసేలా చర్యలు చేపట్టారు.