kumaram bheem asifabad- ఏడాదిగా ఎదురుచూపులే
ABN , Publish Date - Nov 05 , 2026 | 11:08 PM
మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల మూతబడి ఏడాది గడిచినా అధికారులు పట్టించు కోవడం లేదు. ఈ కళాశాల 20 ఎకరాల్లో పాఠశాల క్యాంపస్ కోసం కేటాయించారు. ఇందులో కొన్ని భవనాలు 2000లో ప్రారంభించారు. కొన్ని ప్రత్యేకంగా భోజనాలు చేసేందుకు, మరికొన్ని వసతి కోసం కేటాయించారు. కాగా ఇవన్నీ కూడా ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షాకాలంలో గదులు నుంచి నీరు కారుతోంది. గోడలు నానిపోవడంతో విద్యుత్ షాక్ సైతం వచ్చిన పరిస్థితి ఉంది.. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ జిల్లా అధికారులకు, సంబంధిత రాష్ట్ర సెక్రటరికి సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ కళాశాలలను అధికారులు ముందు జాగ్రత్తగా పూర్తి గా మూసివేశారు.
- నూతన భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రుల వినతి
సిర్పూరు(టి), నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల మూతబడి ఏడాది గడిచినా అధికారులు పట్టించు కోవడం లేదు. ఈ కళాశాల 20 ఎకరాల్లో పాఠశాల క్యాంపస్ కోసం కేటాయించారు. ఇందులో కొన్ని భవనాలు 2000లో ప్రారంభించారు. కొన్ని ప్రత్యేకంగా భోజనాలు చేసేందుకు, మరికొన్ని వసతి కోసం కేటాయించారు. కాగా ఇవన్నీ కూడా ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షాకాలంలో గదులు నుంచి నీరు కారుతోంది. గోడలు నానిపోవడంతో విద్యుత్ షాక్ సైతం వచ్చిన పరిస్థితి ఉంది.. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ జిల్లా అధికారులకు, సంబంధిత రాష్ట్ర సెక్రటరికి సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ కళాశాలలను అధికారులు ముందు జాగ్రత్తగా పూర్తి గా మూసివేశారు. 600 మంది విద్యార్థులను మంచిర్యాల, జైపూర్, గన్నారం, బెల్లంపల్లి, రెబ్బెన తదితర ప్రాంతాలకు తరలించి విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు సిర్పూరు(టి)లోని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఇప్పటికీ ఈ భవనం విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గత నెల అక్టోబరు 17న పూర్వ విద్యార్థులు కళాశాల ముందు ధర్నా కూడా చేపట్టారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్డాఉతూ 20 ఎకరాల్లో ఉన్న ఈ భవనం పై దృష్టి సారించి వెంటనే మరమ్మతులు చేపట్టి తెరిపించాలని డిమాండ్ చేశారు. అధికారులు పట్టించుకోక పోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పారు. చర్య లు తీసుకోవాలని తహసీల్దార్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 20 రోజుల వ్యవధిలో మండల, జిల్లాస్థాయిలో దశల వారీ పోరాటం చేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కళాశాలపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా అధికారులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే స్పందించి కొత్త భవనం నిర్మించి వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.