Share News

kumaram bheem asifabad-శివాజీ మహారాజ్‌ కు ఘన నివాళి

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:02 PM

జిల్లా వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతిని గురువారం ఘనంగా నిర్వహచారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ స్పూర్తితో ముందుకు సాగాలని ఆయన అడుగు జాడల్లో నడవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలో శివాజీ చౌక్‌లోని శివాజీ మహారాజ్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే మండలంలోని బెల్గాం గ్రామంలో శివాజీ మమారాజ్‌ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పాల్గొని నివాళులు అర్పించారు.

kumaram bheem asifabad-శివాజీ మహారాజ్‌ కు ఘన నివాళి
ఆసిఫాబాద్‌లో శివాజీ మహారాజ్‌ విగ్రహానికి పూల మాల వేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌/చింతలమానేల్లి/దహెగాం/బెజ్జూరు/పెంచికలపేట/వాంకిడి/సిర్పూర్‌(టి)/జైనూర్‌/సిర్పూర్‌(యు)/వాంకిడి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతిని గురువారం ఘనంగా నిర్వహచారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ స్పూర్తితో ముందుకు సాగాలని ఆయన అడుగు జాడల్లో నడవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలో శివాజీ చౌక్‌లోని శివాజీ మహారాజ్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే మండలంలోని బెల్గాం గ్రామంలో శివాజీ మమారాజ్‌ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పాల్గొని నివాళులు అర్పించారు. బీజేపీ నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు పాల్గొని పూల మాల వేసి నివాళులు అర్పించారు. అలాగే బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి శివాజీ చిత్రపటానికి పూల మాలలు వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు వెంకన్న, బాలకృష్ణ, సలాం, అశోక్‌, నాయకులు అలీబీన్‌ అహ్మద్‌, రవి, బాలేశ్వర్‌గౌడ్‌, బిక్కాజీ, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. చింతలమానేపల్టి మండల వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి వేడుకలను ఆరెకుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆరెకుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆరె కుల సంఘం నాయకులు నానయ్య, వెంకయ్య, మల్లయ్య, నానయ్య, భాస్కర్‌, మారుతి తదితరులు పాల్గొన్నారు. దహెగాం మండల వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి వేడుకలను ఆరెకులస్తులు, నాయకులు ఘనంగా జరుపుకన్నారు. ఛత్రపతి శివాజీ జెండాను తాలూకా ఉపాధ్యక్షుడు బక్కయ్య ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆరె సంఘం నాయకులు వెంకన్న, నారాయణ, పి.నారాయణ, తిరుపతి, సంజీవ్‌, ప్రశాంత్‌, గంగారాం, సర్పంచ్‌లు జయలక్ష్మి, మహేష్‌గౌడ్‌, నాయకులు ధనుంజయ్‌, నాగేష్‌గౌడ్‌, రమేష్‌, సంతోష్‌, భీమన్న, అశోక్‌, శ్యాంరావు, రవీందర్‌కుమార్‌, మహేష్‌, మారుతి, శ్రీదేవి, అనసూయ, రాజేష్‌, ఎస్సై విక్రమ్‌,బక్కయ్య, తదితరులు పాల్గొన్నారు. బెజ్జూరు మండలం ముంజంపల్లి గ్రామంలో శివాజీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు పాల్గొని శివాజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని శివాజీ మహారాజ్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుశీలాబాయి, నాయకుల మల్లయ్య, జనార్ధన్‌, రంగయ్య, కిష్టయ్య, నారాయణ, రాకేష్‌, సంజీవ్‌ , సర్పంచ్‌ దానయ్య, నాయకులు గణపతి, బీఆర్‌ఎస్‌ నాయకులు వెంకన్న, రాజేష్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. పెంచికలపేట మండల వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి వేడుకలను గురువారం ఘనంగా జరుపుకన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఆరె సంక్షేమ సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్‌ బుద్ధ విహార్‌లో పులువురు శివాజీ మహారాజ్‌ చిత్రపటానికి పూలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సతీష్‌, బౌద్ద మహాసభ నాయకులు అశోక్‌, సందీప్‌, దుర్గాజీ, విజయ్‌, తదితరులు పాల్గొన్నారు. సిర్పూర్‌(టి) మండలంలోని గ్రామాల్లో ఛత్రపతి శివాజీ చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఆరె సంక్షేమ సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు. జైనూర్‌ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌ జయంతి ఉత్సవంలో పాల్గొని నివాళులు ఆర్పించారు. బీసీ సంఘాల నాయకులు డాక్టర్‌ నివర్తి గిత్తె, శిందే పాటిల్‌, కెంద్రే శివరాం, కెంద్రే ప్రకాష్‌ తదితరులు వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల ఉపాధ్యక్షుడు పెందుర్‌ ప్రకాష్‌, ప్రకాష్‌ పాటిల్‌, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు. సిర్పూర్‌(యు) మండల కేంద్రంలోని పూలాజీ బాబా సిద్దేశ్వర్‌ సంస్థన్‌ అధ్వర్యంలో సిద్దేశ్వర్‌ సంస్థ వార్షిక ఉత్సవంతోపాటు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతిని గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆత్రం ఓంప్రకాష్‌, ఆత్రం భీంరావు రాజా, గ్రామ పటేల్‌ ఆత్రం ఆనంద్‌రావు, ఆత్రం జ్యోతిరాం పటేల్‌, సిద్దేశ్వర్‌ సంస్థాన్‌ అధ్యక్షుడు దత్త మదేవాడ్‌ పాల్గొన్నారు. కౌటాల మండలంలో శివాజీ మహారాజ్‌ విగ్రహానికి పూల మాల లు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆరె సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 11:02 PM