Share News

kumaram bheem asifabad- మాతా జీజాబాయికి ఘన నివాళి

ABN , Publish Date - Jan 12 , 2026 | 10:45 PM

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ తల్లి మాతా జీజాబాయి జయంతి వేడుకలను సోమవారం మండల కేంద్రంలోని జేత్వాన్‌ బుద్ధ విహార్‌లో అంబేద్కర్‌ యువజన సంఘం, బీఎస్‌ఐ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

kumaram bheem asifabad- మాతా జీజాబాయికి ఘన నివాళి
వాంకిడిలో నివాళులు అర్పిస్తున్న బౌద్ధ ఉపాసకులు

వాంకిడి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఛత్రపతి శివాజీ మహరాజ్‌ తల్లి మాతా జీజాబాయి జయంతి వేడుకలను సోమవారం మండల కేంద్రంలోని జేత్వాన్‌ బుద్ధ విహార్‌లో అంబేద్కర్‌ యువజన సంఘం, బీఎస్‌ఐ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పశ్చిమ కనుమలలో గొప్ప పేరు పొందిన రాయ్‌ఘడ్‌ కోటను జయించి ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు పట్టాభిషేకం చేయించడానికి ఆమె చేసిన కృషిని ఈ సందర్బంగా పలువురు కొనియాడారు. కార్యక్రమంలో హూమన్‌రైట్స్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు మధుబావల్‌కార్‌, బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు మహోల్‌కార్‌ అశోక్‌, అంబేద్కర్‌ సంఘం మండల నాయకలు ఉప్రె జైరాం, దుర్గం దుర్గాజీ, దుర్గం సందీప్‌, విలాస్‌, రాజేంద్రప్రసాద్‌, దుర్గం ప్రశాంత్‌, దుర్గం శ్యాంరావు, విఠ్టల్‌, రోషన్‌, రాజేశ్వర్‌, రమాబాయి మహిళ మండలి ఉపాసకులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, (ఆంధ్రజ్యోతి): ఛత్రపతి మహరాజ్‌ తల్లి రాజమాత జీజాబాయి జయంతిని పట్టణంలోని ఆరె సంక్షేమ సంఘం భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకుల జయరాం, దాదారాం, సర్పంచ్‌ రవీందర్‌, బిక్కాజీ, గోపాల్‌, తిరుపతి, అన్నారావ్‌, మారుతి, రమేష్‌, దిలీప్‌, ప్రశాంత, శంకర్‌, సంతోష్‌కుమార, శ్యాంరావు, రాజు, రాజన్న, బిజ్జు, చిత్రు, కమలాకర్‌, రాజు, ఆనంద్‌రావ్‌, అంతు, దాము, బాలాజీ, కిషన్‌ మురళీ, బాలాజీ, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఆరె సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జీజాబాయి చిత్రపటానికి పుష్పాలతో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకుల మోహన్‌, శ్యాంరావు, కిశోర్‌, దివాకర్‌, సర్పంచ్‌ యోగుదాస్‌, రాజు, ఉప సర్పంచ్‌ వసంత్‌రావు, మారుతి, అశోక్‌, రమేష్‌, బి.రమేష్‌, సంతోష్‌, దేవాజీ, కిషన్‌, లక్ష్మయ్య, గుణాకర్‌, పురుషోత్తం, దేవ్‌రావు, నాందేవ్‌, రావుజీ, ధర్మారావ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 10:45 PM