Share News

kumaram bheem asifabad- గుడ్డు వడ్డించేందుకు గడ్డుకాలం

ABN , Publish Date - Jul 15 , 2026 | 10:41 PM

పెరిగిన కోడి గుడ్ల ధరలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణపై ప్రభావం చూపుతున్నాయి. నెల కిందట గుడ్డు ధర రూ.6.50గా ఉంది. ప్రస్తుతం హోల్‌సేల్‌లో రూ.7.50వరకు పలుకుతోంది. చిల్లర ధర రూ 8కి విక్రయిస్తున్నారు. ప్రభు త్వ విద్యార్థులకు వారంలో మూడు సార్లు ఉడుకబెట్టిన గుడ్డు ఇవ్వాలనేది ప్రభుత్వ

kumaram bheem asifabad- గుడ్డు వడ్డించేందుకు గడ్డుకాలం
లోగో

బెజ్జూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పెరిగిన కోడి గుడ్ల ధరలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణపై ప్రభావం చూపుతున్నాయి. నెల కిందట గుడ్డు ధర రూ.6.50గా ఉంది. ప్రస్తుతం హోల్‌సేల్‌లో రూ.7.50వరకు పలుకుతోంది. చిల్లర ధర రూ 8కి విక్రయిస్తున్నారు. ప్రభు త్వ విద్యార్థులకు వారంలో మూడు సార్లు ఉడుకబెట్టిన గుడ్డు ఇవ్వాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ కాంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు గుడ్డుకు రూ.6మాత్రమే చెల్లిస్తున్నారు. పెరిగిన ధరల ప్రకారం మూడు రోజులూ గుడ్డు అందించాలంటే ఏజెన్సీలే భారం మోయాల్సి వస్తోంది. కోడిగుడ్లు, నిత్యావసర ధరల పెరుగుదలను బట్టి వ్యత్సాసాన్ని ప్రభుత్వమే భోజన పథకం కార్మికులకు చెల్లించాలి. ఒక విద్యార్థికి సగటున రూ.3కి పైగా భారం పడుతోంది. ప్రభుత్వమే గుడ్లు, నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

- జిల్లాలో పరిస్థితి ఇలా..

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రాథ మిక పాఠశాలలు 833, ప్రాథమికోన్నత పాఠ శాలలు 106, ఉన్నత పాఠశాలలు 103 ఉన్నా యి. జిల్లాలో 70వేలకు పైగా విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందా ల్సిన కోడిగుడ్లు ధరల పెరుగుదలతో చాలా చోట్ల కోతలు పెడుతున్నారు. వారంలో మూడు సార్లు ఇవ్వాల్సి ఉండగా కొన్నిచోట్ల రెండు సార్లు, కొన్ని పాఠశాలల్లో అది కూడా లేదు. అక్కడక్కడ మాత్రం మెనూ ప్రకారం గుడ్డు అందిస్తున్నారు. గుడ్ల ధరలు అమాంతం పెరగ డం, ప్రభుత్వం ఇచ్చే ధర తక్కువ ఉండడం మూలంగా నిర్వాహకులపై ఆర్థిక భారం పడుతోంది. అప్పులు తెచ్చి గుడ్లు వడ్డిస్తున్నామని, పెరిగిన ధరలతో భారంగా ఉందని నిర్వాహకులు అంటున్నా రు. ధరల పెరుగుదలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని వంట నిర్వాహకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jul 15 , 2026 | 10:42 PM