Share News

kumaram bheem asifabad- పది అంశాలపై ప్రణాళిక

ABN , Publish Date - Mar 05 , 2026 | 10:37 PM

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పది అంశాలపై జిల్లాలో ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని కలెక్టర్‌ కెహరిత అన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచ రణపై కలెక్టర్‌ జూమ్‌ మీటింగ్‌ ద్వారా సమీక్షా నిర్వహించారు.

kumaram bheem asifabad- పది అంశాలపై ప్రణాళిక
జూమ్‌ మీటింగ్‌లో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పది అంశాలపై జిల్లాలో ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని కలెక్టర్‌ కెహరిత అన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచ రణపై కలెక్టర్‌ జూమ్‌ మీటింగ్‌ ద్వారా సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలపై ఈ నెల 6 నుంచి జూన్‌ 12 వరకు 99 రోజుల కార్యాచరణపై వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఈ 99 రోజుల కార్యక్రమం ప్రధానంగా 10 అంశాలపై కొనసాగుతుందని తెలిపారు. మార్చి 6 నుంచి 15 వరకు గ్రామాలలో మున్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యక్రమాలలో పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. పెండింగ్‌ ఫైళ్ల పరిష్కార కార్యక్రమం చేపట్టాలన్నారు. మార్చి 8వ ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, చైర్మన్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి భాగస్వామ్యంతో 99 రోజుల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్‌, ఆరోగ్యం, రహదారి భద్రతలో భాగంగా అరైవ్‌- అలైవ్‌ కార్యక్రమం, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్‌కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, వ్యవసాయం, విదా, యువత, క్రీడలు, మహిళల సంక్షేమం, పర్యావరణంపై కార్యక్ర మాలు చేపట్టాలని కలెక్టర్‌ అన్నారు. అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 10:37 PM