Share News

బాలకృష్ణగౌడ్‌కు కన్నీటి వీడ్కోలు

ABN , Publish Date - May 03 , 2026 | 11:41 PM

రియాక్టర్‌ పేలుడులో గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో చిన్నాకాపర్తికి చెందిన బొడ్డు బాలకృష్ణగౌడ్‌ అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామంలో ముగిశాయి.

బాలకృష్ణగౌడ్‌కు కన్నీటి వీడ్కోలు
బాలకృష్ణగౌడ్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న బంధుమిత్రులు, గ్రామస్థులు

చిన్నకాపర్తిలో రియాక్టర్‌ పేలిన ఘటనలో మృతి

చిట్యాలరూరల్‌, మే 3(ఆంధ్రజ్యోతి): రియాక్టర్‌ పేలుడులో గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో చిన్నాకాపర్తికి చెందిన బొడ్డు బాలకృష్ణగౌడ్‌ అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామంలో ముగిశాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం, చిన్నకాపర్తి సర్పంచ్‌ ఆవుల సుందర్‌యాదవ్‌ తదితరులు బాలకృష్ణగౌడ్‌ మృతదేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ బాలకృష్ణగౌడ్‌ మృతి బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు. బాలకృష్ణగౌడ్‌ కుటుంబానికి ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం నోష్‌ల్యాబ్‌ యాజమాన్యం నుంచి కోటిన్నర నష్టపరిహారం అందించేలా కృషిచేశారని తెలిపారు.

Updated Date - May 03 , 2026 | 11:41 PM