Share News

పోరాట పటిమకు ప్రతిరూపం

ABN , Publish Date - Nov 21 , 2026 | 11:24 PM

పేదల కష్టాలను తన కష్టాలుగా భావించి వారి ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన మహ నీయుడు పండుగ సాయన్న అని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు.

పోరాట పటిమకు ప్రతిరూపం
కల్వకోల్‌లో పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి

- విగ్రహావిష్కరణలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి, పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీహరి

పెద్దకొత్తపల్లి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : పేదల కష్టాలను తన కష్టాలుగా భావించి వారి ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన మహ నీయుడు పండుగ సాయన్న అని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు. అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శనివారం మండలంలోని కల్వకోల్‌ గ్రామంలో పండుగ సాయన్న విగ్రహాన్ని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో క లిసి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. కల్వకో ల్‌లో మత్స్య సహకార సంఘం జిల్లా నాయకు డు సైదులు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి జూపల్లి మాట్లాడారు. పండుగ సాయన్న విగ్ర హం కేవలం ఒక ప్రతి మమాత్రమే కాదని, పే దల ఆత్మగౌరవానికి, హక్కుల కోసం సాగిన పో రాటానికి ప్రతీక అని అన్నారు. ముదిరాజ్‌లతో పాటు మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తు న్నవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

చదువుతోనే జీవితాలు బాగు : మంత్రి శ్రీహరి

చదువుకుంటేనే మ న జీవితాలు బాగుప డుతాయని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకి టి శ్రీహరి అన్నారు. భూస్వాముల, పెత్తందా ర్ల అరాచకాలకు వ్యతి రేకంగా పేదలకు అండగా నిలిచారని అన్నారు. సాయన్న పోరాట పటిమ గురించి మంత్రి వాకి టి వివరించారు. ఈ సభలో జీవన విధ్వం సంపై తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులు అలరించిన నృత్య ప్రదర్శన సభికు లను అలరింపజేసింది. ఈ సభలో ముదిరాజ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొర్ర నాగేశ్వర్‌, మిమిక్రీ ఆర్టిస్టు బిత్తిరి సత్తి, ముదిరాజ్‌ సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు నారాయణ, హైకోర్టు న్యాయవాది డీఎల్‌ పాండు, మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షు డు వి.సత్యం, ముదిరాజ్‌ సంఘం జిల్లా నాయ కులు మల్లయ్య, సైదులు, వెంకట స్వామి, ఆంజ నేయులు, బాలనారాయణ, సర్పంచ్‌లు వెంకట మ్మ, రమేష్‌ ఉప సర్పంచ్‌ కుర్మయ్య, నాగపూరి విష్ణు, సీపీఐ నాయకులు విజేయుడు, ఏసయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2026 | 11:24 PM