kumaram bheem asifabad- పౌష్టికాహారంపై ప్రత్యేక ‘ముద్ర’
ABN , Publish Date - Jan 25 , 2026 | 09:48 PM
అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడి గుడ్లు పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు ప్రత్యేక ముద్ర వేసి అందజేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందజేయాల్సిన కోడి గుడ్లు పక్కదారి పడుతున్నాయని ఆరోపణులు ఉన్నాయి. దీని అరికట్టేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది.
- పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు
సిర్పూర్(టి), జనవరి 25 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడి గుడ్లు పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు ప్రత్యేక ముద్ర వేసి అందజేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందజేయాల్సిన కోడి గుడ్లు పక్కదారి పడుతున్నాయని ఆరోపణులు ఉన్నాయి. దీని అరికట్టేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. కొంత కాలంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గుడ్ల పంపిణీ ప్రక్రియలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా ప్రతీ గుడ్డుపై ప్రత్యేక ముద్ర వేసి అందిస్తారు. దీంతో ఈ గుడ్లు ఎక్కడ కనిపించినా అధికారులు గుర్తించే అవకాశం ఉంటుంది.
- ఇప్పటి వరకు ఇలా..
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతల వివరాలను ఇప్పటికే నమోదు చేశారు. వాటి ఆధారంగా వీరికి గుడ్లు సరఫరా చేస్తున్నారు. ఏడు నెలల నుంచి మూడేళ్ల వయసున్న పిల్లలకు నెలకు 16, గర్భిణులు, బాలింతలకు రోజుకొకటి చొప్పున గుడ్లను అందిస్తున్నారు. అంగడ్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పాఠశాలలోనే ఉడికించి పెడుతున్నారు. వివిధ కారణాలతో కొందరు మహిళలు స్థానికంగా లేకపోయినా, వారికి గు డ్లు అందజేసినట్లుగా రికార్డుల్లో రాసుకుని కొందరు సిబ్బంది దారి మళ్లిస్తున్నట్లు ఆరోప ణలు ఉన్నాయి. కాగా ఇక నుంచి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసే గుడ్లపై ‘అంగన్‌వాడీ గుడ్లు.. తెలంగాణ ప్రభుత్వం’ అని ముద్రవేసి సంబంధిత జోన్ నంబర్‌ను కూడా పేర్కొంటారు. దీంతో ప్రభుత్వ ముద్ర ఉన్న గుడ్లను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, ఇతరు భయపడతారు. పొరపాటున అధికా రులో, ప్రజలో వీటిని గుర్తిస్తే అవమానంతో పాటు శిక్షలు తీవ్రంగా ఉంటాయని కొనుగోలు చేయడానికి జంకుతారు. దీంతో అక్రమ రవాణా, వినియోగాన్ని ప్రాథమిక దశలోనే కట్టడి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తే సంబంధిత అధికారి వేలి ముద్రతో దీనిని అనుసంధానం చేశారు.
- మూడు రంగుల్లో..
అంగన్‌వాడీ కేంద్రాలకు జూలై నుంచి ఫిబ్రవరి వరకు నెలకు రెండు విడతలుగా గుడ్లు అందజేస్తారు. మార్చి నుంచి జూన్ వరకు వేసవిలో గుడ్లు త్వరగా పడైపోయే ప్రమాదం ఉండడంతో నెలలో మూడు సార్లు సరఫరా చేస్తారు. వేసవిలో అందించే గుడ్లపై నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగులు, చలికాలం, వర్షాకాలం అందించే గుడ్లపై ఎరుపు, ఆకుపచ్చ రంగులను ముద్రిస్తారు. ముద్ర మధ్యలో అంగన్‌వాడీ కేంద్రం ఏ జోన్ పరిధిలోకి వస్తుం దో ఆ జోన్ నంబరును కూడా ఐదు మిల్లీమీ టర్ల పొడవు, వెడల్పుతో ముద్రిస్తున్నారు. ప్రత్యేకమైన ముద్ర వేసిన ఈ గుడ్డునే ప్రస్తు తం అంగన్‌వాడీ కేంద్రాల్లో అందజేస్తున్నట్లు చెబుతున్నారు.