Share News

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలి

ABN , Publish Date - Jul 17 , 2026 | 10:57 PM

ఎస్సీ, ఎస్టీల సంక్షే మానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌ కా ర్యాలయ భవన సమావేశ మందిరంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ, ఎస్టీల సంక్షే మానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌ కా ర్యాలయ భవన సమావేశ మందిరంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ షె డ్యూల్డు కులములు, తెగలలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలను పక డ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలో 56,969 మంది షెడ్యూల్డు తెగలు, 1,99,493 మంది షెడ్యూల్డు కులాల వారు ఉన్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం సక్షేమ పథకాలను వర్తించే విధంగా అధి కారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల విద్యా ర్థులకు దుప్పట్లు, యూనిఫాంలు, పుస్తకాలు, మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం ప్రకారం గ్రామాల్లో గ్రామసభ లు నిర్వహించి అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు నిబంధనలకు లో బడి పట్టాలు జారీచేసేలా రెవెన్యూ, అటవీ, పోలీసుల అధికారులు స మన్వయంతో సర్వే చేయాలన్నారు. జిల్లాలో బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశా లల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ప్రవేశాల దృష్య్టా పాఠశాలలకు చెల్లించాల్సిన బకాయిలు, కులాంతర వివాహ ప్రోత్సహకాలు, ఇతర రంగాలకు సం బంధించిన అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్దం చేసి అం దించాలన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అభి వృద్ధి, సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులైన వారికి సంక్షే మపథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్ర మంలో డీసీపీ భాస్కర్‌,అదనపు కలెక్టర్‌లు చంద్రయ్య,రాములు, సబ్‌ కలెక్టర్‌ మ నోజ్‌, జిల్లా అటవీ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, రెవెన్యూ అధికారి మోతిరాం, కమీషన్‌ సభ్యులు రేణి కుంట్ల ప్రవీణ్‌, కుస్రం నీలాదేవి, రాం బాబునాయక్‌, లక్ష్మీనారాయణ, శంకర్‌,ఆర్డీవో శ్రీనివాసరావు, డిప్యూటి ట్రైనీ కలెక్టర్‌ విలాయత్‌ ఆలీ, మానిటరింగ్‌ కమిటీ సభ్యులు నారాయణ, రాజనర్సు, మల్లయ్య, రాన్న పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 10:57 PM