Share News

మారుపేర్ల సమస్యకు మోక్షం...

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:32 AM

సింగరే ణిలో మారు పేర్లపై విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్న డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటనతో కార్మిక కుటుం బాల్లో హర్షం వ్యక్తమవుతోంది. పేరు మార్పిడి కోసం ద శాబ్ధాలుగా ఎదురు చూస్తున్నప్పటికీ ఆ అంశంపై ఏ ప్రభుత్వమూ సీరియస్‌గా స్పందించకపోవడంతో కార్మి కుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చం దంగా తయారైంది.

మారుపేర్ల సమస్యకు మోక్షం...

-మానవీయ కోణంలో పరిష్కరిస్తామన్న డిప్యూటీ సీఎం

-దశాబ్ధాలుగా సింగరేణి కార్మికుల ఎదురు చూపు

-హామీ అమలైతే వారసత్వ ఉద్యోగాలకూ లైన్‌ క్లియర్‌

-ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక కుటుంబాల హర్షం

మంచిర్యాల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సింగరే ణిలో మారు పేర్లపై విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్న డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటనతో కార్మిక కుటుం బాల్లో హర్షం వ్యక్తమవుతోంది. పేరు మార్పిడి కోసం ద శాబ్ధాలుగా ఎదురు చూస్తున్నప్పటికీ ఆ అంశంపై ఏ ప్రభుత్వమూ సీరియస్‌గా స్పందించకపోవడంతో కార్మి కుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చం దంగా తయారైంది. సింగరేణి కార్మికులకు మారు పేర్ల స్థానంలో సొంత పేర్లు అమలుకుచర్యలు చేపడతా మని 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయం గా హామీ ఇచ్చారు. అయితే దాదాపు ఏడేళ్లు గడుస్తు న్నా హామీ నెరవేరలేదు. ఈ లోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ అంశం పూర్తిగా మరుగున పడ్డట్లయిం ది. పేర్ల మార్పిడి విషయంలో సాంకేతిక సమస్యలు త లెత్తాయనే నేపథ్యంతో ఆ ప్రక్రియను అంతటితోనే నిలి పివేశారు. సింగరేణి వ్యాప్తంగా మారు పేర్లతో విధులు నిర్వహిస్తున్న వారు సుమారు 128 మంది వరకు ఉ న్నారని, వారి సమస్యను మానవీయ కోణంలో పరిష్క రించేందుకు ప్రభుత్వ కట్టుబడి ఉందని శాసనమండ లిలో ఈ నెల 8న డిప్యూటీ సీఎం ప్రకటించారు.

నిరక్ష్యరాస్యులు కావడంతో...

సుమారు 40 ఏళ్ల క్రితం ఉద్యోగాల్లో చేరిన వారు ఏ పేరుతో విధులు నిర్వహిస్తున్నారో కూడా తెలియని రో జులవి. దానికి తోడు అప్పట్లో అధిక శాతం మంది ని రక్షరాస్యులు సింగరేణి ఉద్యోగాల్లో చేరారు. ఎలాంటి వి ద్యార్హతలు లేకుండా బరువులు ఎత్తడం, పరుగు పం దెంలో పాల్గొని విజయం సాధించిన వారికి సంస్థ నేరు గా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సరియైన ధృవీ క రణ పత్రాలు లేని ఆ రోజుల్లో ఉద్యోగంలో చేరే సమ యంలో కార్మికులు చెప్పిన పేర్లనే సింగరేణి అధికారు లు నమోదు చేసుకున్నారు. అప్పట్లో గ్రామాల్లో ఇంటి పేరుతో పాటు వారు పని చేసే కుల వృత్తుల పేర్లతో కూడా సంభోధనలు ఉండేవి. అలా కులవృత్తుల పేరు తో పిలవబడే వారు ఉద్యోగంలో చేరిన తరువాత గను లపై ఆ పేరే కార్మికుల పేరుగా స్థిరపడింది. అప్పట్లో ఇంటిపేర్లపై పెద్దగా పట్టింపులు లేకపోవడం, పైగా నిరక్షరాస్యులు కావడంతో తమ పేర్ల గురించి కార్మికు లు ఏనాడూ రికార్డుల్లో పరిశీలన చేసుకోలేదు. సొంత పేర్లు రికార్డుల్లో ఎక్కించుకోవాలన్న ఆలోచన కూడా కా ర్మికులకు రాలేదు. దీంతో దశాబ్దాల తరబడి మారు పేర్లతోనే ఉద్యోగాలు చేస్తున్నారు.

డిపెండెంట్‌ ఉద్యోగాలపై ప్రభావం...

మారు పేర్లతో ఉద్యోగాలు చేస్తున్న కార్మికుల పిల్లల పై దాని ప్రభావం అధికంగానే పడుతోంది. అప్పటి కా ర్మికుల పిల్లల్లో ఉన్నత చదువులు చదివిన వారు ప్ర స్తుతం అనేక మంది ఉన్నారు. వారి సర్టిఫికేట్లన్నీ సొం త పేర్లతోనే ఉన్నాయి. తండ్రి ఇంటి పేరులో దొర్లిన త ప్పుల కారణంగా పిల్లల చదువుల్లోనూ దాని ప్రభావం పడింది. అలాగే సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడంతో మారు పేర్లతో ఉన్న కార్మికు ల పిల్లలు కొలువులో చేరేందుకు కూడా అడ్డంకిగా మా రాయి. అనారోగ్య కారణాలతో కార్మికులు మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ అ యిన సందర్భంలో తన తండ్రి ఇంటి పేరులో అక్షర దో షం ఉందనే సాకుతో పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేందు కు సింగరేణి అధికారులు నిరాకరించిన సందర్భాలు అనే కం ఉన్నాయి. అలాంటి కేసులు కొత్త గూడెం కార్పొరే ట్‌ విజిలెన్స్‌ విభాగం కార్యాలయంలో వందలాదిగా పెం డింగులో ఉన్నాయి.

ఈ విషయమై గతంలో పలు మార్లు కార్మిక కుటుం బాలు అప్పటి ముఖ్యమంత్రితోపాటు సంస్థ సీఎండీ దృ ష్టికి తీసుకెళ్లినా సమస్యకు పరిష్కారం లభించలేదు.

డిప్యూటీ సీఎం హామీతో ఆశలు...

దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందోనని వందలాది కార్మిక కుటుం బాలు ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది జూలై 13న జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భ ట్టి విక్రమార్క సింగరేణి కార్మికుల మారు పేర్లపై ప్రక టన చేయడంతో వారి కుటుంబాల్లో మళ్లీ ఆశలు చిగు రిస్తున్నాయి. సింగరేణిలో కారుణ్య నియామకాలకు ఎం పికైన 335 మందికి జిల్లా కేంద్రంలో డిప్యూటీ సీఎం భ ట్టి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని ఏడు జిల్లాల నుంచి లబ్ధిదా రు లు హాజరై నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మారు పేర్ల తో విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికులకు సొంత పేర్లు అమలు చేస్తామని ప్రకటించారు. ఇందు కోసం సింగరేణి అఽధికారులు, యూనియన్‌ నాయకులతో ప్ర త్యేకంగా కమిటీ వేయనున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీ ఎం ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామని, దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చట్ట ప్రకారం ఒకరి పేరుపై మరొకరు ఉద్యో గం చేయడం తీవ్రమైన అంశమైనప్పటికీ, కార్మికుల ప రిస్థితి అర్థం చేసుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని భట్టి వెల్లడించడంతో సంబంధిత కుటుం బాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దశాబ్దాల కాలంగా పెండింగులో ఉన్న సమస్యకు పరిష్కారం లభించనుం డటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 09 , 2026 | 12:32 AM