Share News

అసంతృప్త వాదులకు గాలం..

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:25 AM

వివిధ పా ర్టీల నుంచి టిక్కెట్లు దక్కని అసంతృప్త వాదులకు మిగ తా పార్టీలు గాలం వేస్తున్నాయి. టిక్కెట్లు ఇస్తామం టూ ఆఫర్‌ చేస్తూ తమ పార్టీల్లోకి లాగుతున్నాయి. ము నిసిపల్‌ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల్లోకి వలస లు రోజు రోజుకూ తీవ్రతరం అవుతుండగా, బీ ఫాంలు చేతికి వచ్చే వరకు ఎవరు ఏ పార్టీ అభ్యర్థులో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి.

అసంతృప్త వాదులకు గాలం..

ఆఫర్లు ఇస్తున్న పార్టీలు

-రోజు రోజుకూ పెరుగుతున్న వలసలు

-పార్టీ సిద్దాంతాలు గాలికి వదిలేస్తున్న వైనం

-వలసలను ప్రోత్సహిస్తున్న ప్రధాన పార్టీలు

-మునిసిపల్‌ ఎన్నికలవేళ జంప్‌ జిలానీల హవా

మంచిర్యాల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): వివిధ పా ర్టీల నుంచి టిక్కెట్లు దక్కని అసంతృప్త వాదులకు మిగ తా పార్టీలు గాలం వేస్తున్నాయి. టిక్కెట్లు ఇస్తామం టూ ఆఫర్‌ చేస్తూ తమ పార్టీల్లోకి లాగుతున్నాయి. ము నిసిపల్‌ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల్లోకి వలస లు రోజు రోజుకూ తీవ్రతరం అవుతుండగా, బీ ఫాంలు చేతికి వచ్చే వరకు ఎవరు ఏ పార్టీ అభ్యర్థులో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే నా మినేషన్‌ ప్రక్రియ ప్రారంభమై ముగింపు దశకు చేరుకున్నా గురు వారం నాటికి కూడా బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పూర్తిస్థాయిలో తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఎన్నికల బరిలో నిలి చే సమర్థవంతమైన అభ్యర్థులు లేకపోవడంతో అధికార కాంగ్రెస్‌లో నిరాశకు గురైన వారికి ఆయా పార్టీలు టిక్కె ట్లు ఇస్తామంటూ ఆహ్వానాలు పలుకుతున్నాయి. ఇదే మాదిరిగా బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు గెలుపు గుర్రా లను కాంగ్రెస్‌ పార్టీ సైతం ఆకర్శించింది. జిల్లా వ్యాప్తం గా ఎన్నికలు జరుగునున్న మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో ఈ వలస రాజకీయాలు చోటు చేసు కుంటుండగా, మంచిర్యాల కార్పొరేషన్‌లో ఈ పరిస్థితు లు అధికంగా ఉన్నాయి.

సిద్దాంతాలు గాలికి...

మునిసిపల్‌ ఎన్నికలను పురస్కరించుకొని కేవలం బరిలో నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ద్వితీయ శ్రేణి నాయకుల వైఖరి తెలియజేస్తోంది. ఎలాగైనా టిక్కె ట్లు తెచ్చుకోవాలనే పట్టుదలతో అంత వరకు పనిచేసిన పార్టీని వదిలి, ఇతర పార్టీల్లోకి వలస వెళ్తున్నారు. దశాబ్దాల కాలంగా ఒకే పార్టీలో పని చేసిన వారు కూడా చివరి నిమిషంలో టిక్కెట్లు రాని కారణంగా పార్టీల సిద్దాంతాలను గాలికి వదిలేసి, మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మునిసిపల్‌ ఎన్నికలను పురస్క రించుకొని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల ముఖ్య నాయకులు అభ్యర్థుల ఎంపికలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తున్నారు. కొన్ని చోట్లా తమ పార్టీకి ప్రజాధారణ లేని వార్డుల్లో ఇతర పార్టీల నుంచి డంప్‌ చేసుకోవడానికి వెనకాడటం లేదు. జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలను కైవసం చేసుకోవా లనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్‌ నాయకులు ఉండగా, అధికార పార్టీతో సమానంగా సీట్లు సాధించాలనే తపనతో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. దీంతో ఎన్నికల్లో గెలవగలిగే వారి కోసం వెతుకుతున్నాయి. ఈ క్రమం లోనే ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నా యి. దీంతో తమ పబ్బం గడుపుకోవడానికి ప్రజల్లో ప ట్టున్న నాయకులు అవలీలగా పార్టీలు మారుతు న్నారు. జిల్లాలోని మిగతా మునిసిపాలిటీలతో పోల్చితే మంచి ర్యాల కార్పొరేషన్‌లో జంప్‌ జిలానీల హవా జోరుగా సాగుతుందన్న ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా ఎన్నికల అనంతరం జంప్‌ జిలానీలంతా అధికారం చే పట్టిన పార్టీలోకి తిరిగి వెళ్లడం ఖాయమన్న అభిప్రా యాలు కూడా వ్యక్తమతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ విషయానికి వస్తే టిక్కెట్లు లభించని వారిని ఎమ్మెల్యేలు బుజ్జగిస్తున్నా....పలువురు ఆశావహులు ససేమిరా అం టున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల కార్పొరేషన్‌లో అ భ్యర్థుల గెలుపే లక్ష్యంగా టిక్కెట్లు కేటాయిస్తున్న ఎ మ్మెల్యే ప్రేంసాగర్‌రావు టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు టిక్కెట్లు దక్కిని వారికి ఆయన కో ఆప్షన్‌ సభ్యునిగా అవకాశం ఇస్తానని చెబుతున్నట్లు తెలుస్తోం ది. అయినా వినిపించుకోని ఆశావహులు పలువురు ఇతర పార్టీల్లో చేరుతుండటం గమనార్హం.

నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం....

మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగియనుంది. ఈ నెల 28 నుం చి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకాగా ఈ నెల 30తో ముగుస్తుంది. రెండు రోజుల్లో నత్తనడక సాగిన నామినే షన్‌ దాఖలు ప్రక్రియ చివరి రోజు ఊపందుకో నుంది. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా మొత్తం 35 నామినేష న్లు దాఖలయ్యాయి. జిల్లాలోని ఎన్నికలు జరుగనున్న 149 వార్డులకు గాను ముగ్గురేసి అభ్యర్థులు బరిలో ఉం డనుండగా, స్వతంత్రులతో కలిపి భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీల నుంచి టిక్కె ట్లు ఖరారైన వారు పార్టీ గుర్తులపై నామినేషన్లు దా ఖలు చేస్తుండగా, కొందరు పార్టీ గుర్తులతో పాటు స్వ తంత్రులుగా కూడా నామినేషన్లు వేస్తున్నారు. ఒకవేళ చివరి క్షణంలో పార్టీల బీ ఫాం అందకపోయినా స్వతం త్రులుగా బరిలో నిలిచే లక్ష్యంతో రెండు సెట్ల నామినే షన్లు దాఖలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 30 , 2026 | 12:25 AM