Share News

ట్రాఫిక్‌ నియమాలు పాటిస్తేనే సురక్ష జీవితం

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:21 PM

వాహనదారులు ట్రాఫిక్‌ నియమ నిబంధనలు పాటిస్తేనే సురక్షితంగా తమ గమ్యాలకు చేరు కుంటారని డీసీపీ భాస్కర్‌ అన్నారు.

ట్రాఫిక్‌ నియమాలు పాటిస్తేనే సురక్ష జీవితం

మంచిర్యాల డీసీపీ భాస్కర్‌

మంచిర్యాలక్రైం, జనవరి20 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు ట్రాఫిక్‌ నియమ నిబంధనలు పాటిస్తేనే సురక్షితంగా తమ గమ్యాలకు చేరు కుంటారని డీసీపీ భాస్కర్‌ అన్నారు. మంచిర్యా ల పట్టణంలో ఏర్పాటు చేసిన ఆరైవ్‌ అలైవ్‌ కా ర్యక్రమంలో భాగంగా లారీ ఆటోడ్రైవర్లకు వి ద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నియమ ని బంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈసందర్భంగా వారు మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్‌, అలైవ్‌ కార్యక్రమం రోడ్డు భద్రత వా రోత్సవాల్లో భాగంగా వాహనదారులకు, విద్యా ర్థులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామ న్నారు. ట్రాఫిక్‌, రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బా ధ్యత ఎంతో కీలకమన్నారు. ట్రాపిక్‌ నియమా లు పాటించడం చట్టపరమైన బాధ్యతే కాదని మన కుటుంబాల భద్రతకు సంబంధించిన అంశమన్నారు. రోడ్డు భద్రతను జీవనశైలిలో భాగం చేసుకోవాలన్నారు. మద్యం సేవించి వా హనం నడుపకుండా ట్రాఫిక్‌ నిబంధనలను తప్పకుండా పాటిస్తూ తమ కుటుంబాలను, స మాజాన్ని సురక్షితంగా ఉంచాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వైద్యులు సీపీఆర్‌ చేసే విధానాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాశ్‌, ఇన్స్‌పెక్టర్లు ప్ర మోద్‌రావు, ఆకుల అశోక్‌, నరేశ్‌కుమార్‌, ఆర్డీ వో గోపినాథ్‌, వైద్యులు కుమారస్వామి పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:21 PM