నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
ABN , Publish Date - May 16 , 2026 | 04:53 AM
సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా అక్కడ కాంగ్రెస్ అగ్రనేతలను కలవనున్నారు. అలాగే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ....
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా అక్కడ కాంగ్రెస్ అగ్రనేతలను కలవనున్నారు. అలాగే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కుమార్తె వివాహానికి కూడా సీఎం హాజరుకానున్నారు. ఇక ఈనెల 18న కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన హాజరయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు.. పొదుపు చర్యల్లో భాగంగా సీఎం రేవంత్ తన కాన్వాయ్‌ను నాలుగు వాహనాలకు తగ్గించుకున్నారు. శుక్రవారం పలుచోట్ల కార్యక్రమాలకు హాజరైన ఆయన నాలుగు వాహనాల కాన్వాయ్‌తో ప్రయాణం చేశారు.