kumaram bheem asifabad- అరచేతిలో ప్రచారాస్త్రం
ABN , Publish Date - Feb 04 , 2026 | 10:25 PM
మున్సిప ల్ ఎన్నికలకు మరో వారం రోజులు గడువు మాత్ర మే ఉంది. అభ్యర్థులు ప్రచారానికి అతి తక్కువ సమయం ఉంది. దీంతో సోషల్ మీడియా వార్‌కు తెరలేపారు. సామాజిక మాధ్యమాలలో పోటాపోటీ గా ప్రచారం మొదలు పెట్టారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లను ఉపయో గించుకొని ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు.
- తక్కువ ఖర్చు ఎక్కువ ప్రచారం
- వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అస్త్రాలు
- గ్రూపులో పోస్టులు పెడుతూ ఓటు వేయాలని విజ్ఞప్తి
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): మున్సిప ల్ ఎన్నికలకు మరో వారం రోజులు గడువు మాత్ర మే ఉంది. అభ్యర్థులు ప్రచారానికి అతి తక్కువ సమయం ఉంది. దీంతో సోషల్ మీడియా వార్‌కు తెరలేపారు. సామాజిక మాధ్యమాలలో పోటాపోటీ గా ప్రచారం మొదలు పెట్టారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లను ఉపయో గించుకొని ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. వాట్సాప్ గ్రూపులను ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం చేయడానికి సిద్ధం అవుతున్నారు. రీల్స్ వీడియోలు ఇమేజ్‌లు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. పలు వాగ్దానాలు ఇస్తూ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపిం చాలని కోరుతున్నారు.
- ప్రచారంలో దూకుడు..
మున్సిపాలిటీ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం ముగి సింది. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ పార్టీల వారిగా బీఫామ్‌ల అందజేత పూర్తయింది. ఇక మిగిలింది అభ్యర్థుల ప్రచారమే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 11న జరుగనుంది. పోలింగ్‌కు తక్కువ సమయం ఉండడంతో ప్రచారంలో అభ్యర్థు లు దూకుడు పెంచారు. పట్టణల్లో ప్రతీ ఒక్కరికి స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు స్మార్ట్ ప్రచారం మొదలు పెట్టారు. అతి తక్కువ సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకు నేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. వాట్సాప్, పేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉపయో గించు కుంటూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వీలైనంత ఎక్కువ మందికి తమ సందేశం చేరేలా వారిని నమ్మకాన్ని చురగోనేల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్ల ద్వారానే ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఈ ప్రచారమే ప్రధాన అస్త్రంగా చేసుకుంటున్నారు. నిత్యం తమ పరిధిలోని వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రా గ్రాం గ్రూపు లను ఏర్పాటు చేసి ఈసారి తమకు మద్దతు పలకాలని ఓటర్లను కోరుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి అవకాశం కల్పించండి గెలిపిస్తే సేవకుడిగా అందుబాటులో ఉంటానని విన్నవిస్తున్నా రు. మీ విలువైన ఓటు నాకే వేయండి అంటూ పలు రకాల వాగ్ధానాలు ఇస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
- 50 వార్డులకు ఎన్నికలు..
జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ల్లోని మొత్తం 50 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు 94 మంది అభ్యర్థులు, కాగజ్‌నగర్‌లోని 30 వార్డులకు 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుధవారం ఎన్నికల బరిలో ఉన్న అభ్య ర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డుల పరిధిలోని కుల సంఘాలు, యువత, అభివృద్ది కమి టీలు, స్నేహితులు ఇలా అందరిని కలుపుకొని ఇంటింటి ప్రచారంతో పాటు ప్రచార సందేశాలను సెల్‌ఫోన్లలో పంపిస్తున్నారు. గ్రూపుల్లో పార్టీల నేతల బొమ్మలు డిజైన్లు చేసి పోస్టర్లతో ప్రచారం మోత మోగిస్తున్నారు. మరికొందరైతే రీల్స్ తయారు చేసి లింక్ లను గ్రూపుల్లో పోస్టు పెడుతున్నారు. పలు కాలనీలలో ఓటర్లను ప్రభావితం చేయగలిగే పెద్ద మనుషులు ముఖ్యులను ప్రచారంలో భాగస్వామ్యం చేసుకుని అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు.