అభివృద్ధికి నాంది
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:41 PM
గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో విస్తరించి, ప్రకృతి సిద్ధ మైన వనరులకు నిలయంగా నిలుస్తున్న మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో ప్రత్యేక భౌగోళిక ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. నదులు, పచ్చని అటవీ ప్రాంతాలు, సారవం తమైన వ్యవసాయ భూములు, అపారమైన బొగ్గు నక్షే పాలు జిల్లా నైసర్గిక స్వరూపానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి.
వనరుల జిల్లా మంచిర్యాల....
-నదులు, అడవులు, ఖనిజ సంపదల సమ్మేళనం
-జిల్లా ఏర్పాటుకు నేటితో దశాబ్దం పూర్తి
-2016 అక్టోబర్ 11న పాలన ప్రారంభం
-పదేళ్లలో అంచెలంచెలుగా అభివృద్ధి
మంచిర్యాల, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో విస్తరించి, ప్రకృతి సిద్ధ మైన వనరులకు నిలయంగా నిలుస్తున్న మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో ప్రత్యేక భౌగోళిక ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. నదులు, పచ్చని అటవీ ప్రాంతాలు, సారవం తమైన వ్యవసాయ భూములు, అపారమైన బొగ్గు నక్షే పాలు జిల్లా నైసర్గిక స్వరూపానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి. సరిగ్గా దశాబ్దం క్రితం మంచిర్యాల ప్రత్యేక జిల్లాగా ఏర్పడగా, నేటితో పదేళ్లు పూర్తి చే సు కుంటోంది. అప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో తూ ర్పు ప్రాంతంగా విలసిల్లిన మంచిర్యాలను కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్ర త్యేక జిల్లాగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిం ది. దీంతో 2016 అక్టోబర్ 11న దసరా పండుగను పు రస్కరించుకొని నూతన జిల్లాలో పాలన అందుబా టు లోకి వచ్చింది. దీంతో 40 ఏళ్లుగా ప్రత్యేక జిల్లా కావా లన్న గంపెడాశతో ఎదురు చూసిన ప్రజల ఆకాంక్ష నె రవేరినట్లయింది. తెలంగాణ రాష్ట్రంలోని ఈశాన్య ప్రాం తంలో ఉన్న మంచిర్యాల జిల్లా సుమారు 4,016.46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. జిల్లాకు గోదా వరి నది ప్రధాన జీవనాధారం. గోదావరికి ఉప నది అయిన ప్రాణహిత కూడా ఈ ప్రాంత భౌగోళిక స్వరూ పంలో కీలక పాత్ర పోషిస్తోంది. నదులు, వాగులు, ఇ తర జలవనరులు వ్యవసాయానికి, తాగు నీటి అవ సరాలకు ఉపయోగపడుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో భిన్నమైన నేలలతోపాటు పలు రకాల జీవావరణ వ్యవస్థలు కనిపిస్తాయి.
అంచలంచెలుగా అభివృద్ధి..
మంచిర్యాల ప్రత్యేక జిల్లాగా ఏర్పడ్డ తరువాత వి విధ పనుల నిమిత్తం కార్యాలయాల చుట్టూ తిరిగే ప్ర జలకు దూరభారం గణనీయంగా తగ్గింది. గతంలో ఈ ప్రాంత వాసులు ప్రతీ పనికి ఆదిలాబాద్ జిల్లా కేం ద్రానికి వెళ్లేవారు. మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ కనీ సం 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రత్యేక జి ల్లాగా ఏర్పడ్డ తరువాత 70 కీలో మీటర్ల లోపే జిల్లా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా, మంచిర్యాల, బెల్లంపల్లి రెం డు రెవెన్యూ డివిజనల్ కేంద్రాల ద్వారా ప్రజలకు వి విధ రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం, డీసీపీ ఆఫీసు అందుబాటులోకి రావడంతో ప్రజలకు రవాణా పరంగా దూరభారం త గ్గినట్లయింది. జిల్లాలో సికింద్రాబాద్- న్యూ ఢిల్లీ ప్ర ధాన రైలు మార్గం ఉండటంతో అభివృద్ధికి దోహద ప డుతోంది. వ్యాపార, వాణిజ్య కేంద్రంగా మంచిర్యాల జి ల్లా విరాజిల్లుతోంది. జిల్లాగా ఏర్పడ్డ పదేళ్ల కాలంలో మంచిర్యాల శరవేగంగా అభివృద్ధి చెందింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా వృద్ధి చెందింది. భూముల ధ రలు ఆశించిన మేర పెరగడం అభివృద్ధికి నాందిగా ని లుస్తోంది. మంచిర్యాల మునిసిపాలిటీ కార్పొరేషన్‌గా అవతరించడంతో జిల్లా కేంద్రంలో శాశ్వత నివాసాలు ఏర్పరచుకొనే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాకు విద్య, వైద్యంలో ప్రత్యేక స్థానం ఉంది. కేజీ మొదలుకొని పీజీ వరకు అకాడమిక్ విద్యతోపాటు, వృత్తి విద్య, పారిశ్రామిక శిక్షణ సంస్థలు అందుబాటు లో ఉన్నాయి. ముఖ్యంగా వైద్యం కోసం జిల్లా నుంచే పొరుగు జిల్లాలు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుం చి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లా కు మహారాష్ట్రతో సరిహద్దు ఉండగా, కోటపల్లి వద్ద ప్రాణహిత నదిపై వంతెన నిర్మాణంతో రెండు రాష్ట్రా లకు రవాణా సులువైంది. రాజకీయంగానూ జిల్లా ప్ర సిద్ధి. జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు అ సెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా, దాదాపు ఆరు లక్షల పై చిలుకు జనాభా ఉంది.
పుష్కలంగా అటవీ సంపద....
మంచిర్యాల జిల్లాలోని జన్నారం, మంచిర్యాల, చె న్నూర్, బెల్లంపల్లి అటవీ డివిజన్ల పరిధిలో ఒక లక్షా 76 వేల 473 హెక్టార్లలో అటవీ భూములు ఉన్నాయి. పై నాలుగు అటవీ డివిజన్లను 11 రేంజ్‌లు, 65 సెక్ష న్లు, 195 బీట్లుగా విభజించి సంరక్షణ చర్యలు చేపడు తున్నారు. మరో వైపు జిల్లాలో 13వేల 301 హెక్టార్లలో దట్టమైన అడవులు విస్తరించి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలోని అటవీ ప్రాంతాలు పర్యావ రణ సమతుల్యతకు దోహదపడుతున్నాయి. వివిధ వృ క్షజాతులు, వన్యప్రాణులు ఈ ప్రాంత సహజ సంప దలో భాగంగా ఉన్నాయి. అడవులు స్థానిక ప్రజల జీవనోపాధికి, వాతావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్య సంరక్షణకు ఎంతగానో దోహదపడుతున్నాయి.
వ్యవసాయానికి అనుకూలమైన నేలలు....
మంచిర్యాల జిల్లా నల్లరేగడి, ఎర్రనేలలకు ప్రసిద్ది. వరి, పత్తి, తదితర పంటలను రైతులు సాగు చేస్తు న్నారు. వర్షపాతం, భూగర్భజలాలు, నీటిపారుదల సౌ కర్యాలు పంటల దిగుబడిపై ప్రభావం చూపుతాయి. వ్యవసాయంతోపాటు పశుపోషణ కూడా గ్రామీణ ఆ ర్థిక వ్యవస్థలో భాగంగా ఉంది. జిల్లాలో దాదాపు 3 లక్షల 33వేల 430 ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ప్రధానంగా వరి, పత్తి, కంది, మొక్కజొన్న పంటలను రైతులు పండిస్తున్నారు.
బొగ్గు నిక్షేపాలకు నిలయం....
సింగరేణి బొగ్గు గనులతో మంచిర్యాల జిల్లాకు పా రిశ్రామికంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. బొగ్గు తవ్వకాలు ఉపాధి కల్పనతోపాటు విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక కార్యకలాపాలకు దోహదపడుతున్నాయి. జిల్లాలో సింగ రేణి ఏరియాలైన శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి పరిధిలో భూగర్భ గనులు, ఓపెన్ కాస్టు గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. జిల్లాలోని మూడు ఏరి యాల పరిధిలో మొత్తం 10 భూగర్భ గనులు, ఐదు ఓపెన్‌కాస్టు గనుల్లో బొగ్గు లభ్యం అవుతోంది. ఆయా గనుల ద్వారా నిత్యం సగటున 44వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. జిల్లాలో బొగ్గు నిల్వలతో పాటు సున్నపురాయి అందుబాటులో ఉంది. జిల్లాలో ఓపెన్‌కాస్టు గనుల విస్తరణ చేపడుతున్న క్రమంలో పర్యావరణ పరిరక్షణ, గాలి నాణ్యత, నీటి వనరుల సం రక్షణపై కూడా ధృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.