kumaram bheem asifabad- అడుగుకో గుంత.. రాకపోకలకు చింత
ABN , Publish Date - Sep 20 , 2026 | 10:25 PM
మండలంలోని ఇంధాని రోడ్డుపై అడుగుకో గుంత ఏర్పడడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారి నుంచి ఇంధాని పంచాయతీ కేంద్రానికి వెళ్లే రహదారి అడుకోగుంత ఏర్పడి అధ్వానంగా తయారైంది. జాతీయ రహదారి నుంచి ఇంధాని గ్రామం వరకు రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వర్షాకాలంలో కొద్దిపాటి వర్షం కురిసినా గుంతల్లో నీరు నిలిచి చేరువుల్లా తలపిస్తుంది.
వాంకిడి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇంధాని రోడ్డుపై అడుగుకో గుంత ఏర్పడడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారి నుంచి ఇంధాని పంచాయతీ కేంద్రానికి వెళ్లే రహదారి అడుకోగుంత ఏర్పడి అధ్వానంగా తయారైంది. జాతీయ రహదారి నుంచి ఇంధాని గ్రామం వరకు రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వర్షాకాలంలో కొద్దిపాటి వర్షం కురిసినా గుంతల్లో నీరు నిలిచి చేరువుల్లా తలపిస్తుంది. వర్షాకాలంలో వర్షపు నీటి గుంతల్లో ద్విచక్రవాహరాలు పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది ఘాట్‌జనగాం గ్రామానికి చెందిన సెండె సంతోష్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుంతను తప్పించబోయి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ దారిపై అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి గాయాలపాలైన సంఘటణలు ఉన్నాయి. ఈ రహదారి పై మండలానికి చెందిన వివిద గ్రామాల ప్రజలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం రాకపోకలు చేస్తుంటారు. రోడ్డు ఆధ్వన్నంగా ఉండడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు మరమ్మతులు చేయాలని అనేక సార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించినా ఫలితం లేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైన పాలకులు ఉన్నతాధికారులు సర్పందించి రోడ్డు మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అధ్వానంగా రోడ్డు..
- దుర్గం దినకర్, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు
జాతీయ రహదారి నుంచి ఇంధాని గ్రామం వరకు రోడ్డు అధ్వానంగా మారింది. అడుగడుగున గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలను తప్పించబోయి గత ఏడాది ఓ వ్యక్తి మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడంలేదు. ఉన్నతాధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలి.