Share News

ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పెద్దపీట

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:04 AM

మహనీయుల త్యాగాలు, వీరుల పోరాటాలతోనే దేశ స్వా తంత్య్రం వచ్చిందని, అహింసా అనే అస్త్రంతో మహా సం గ్రామాన్ని గెలిచి ప్రపంచానికి దిశ నిర్ధేశం చేసిన ఘనత మనదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపా ల్‌రావు పేర్కొన్నారు.

ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పెద్దపీట

-జిల్లా సర్వతోముఖాభివృద్ధికి లక్ష్యంతో ముందడుగు వేద్దాం

-ప్రభుత్వ సలహదారు హర్కర వేణుగోపాల్‌రావు

కలెక్టరేట్‌ ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : మహనీయుల త్యాగాలు, వీరుల పోరాటాలతోనే దేశ స్వా తంత్య్రం వచ్చిందని, అహింసా అనే అస్త్రంతో మహా సం గ్రామాన్ని గెలిచి ప్రపంచానికి దిశ నిర్ధేశం చేసిన ఘనత మనదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపా ల్‌రావు పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాల యం ఆవరణలో 80వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వేణుగోపాల్‌రావు పాలొ ్గన్నారు. మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించి జా తీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వంద నం స్వీకరించారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, బెల్లంపల్లి ఎమ్మె ల్యే వినోద్‌ తదితరులతో కలిసి జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా సలహాదారు మాట్లాడుతూ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంద న్నారు. క్షేత్రస్థాయిలో లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ముందు కు సాగుతుందన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పారిశుధ్యం, రహదారి భద్రత, రైతుల సంక్షేమం, విద్య, యువతకు క్రీడలు, మహిళలు, పర్యావరణ వంటి అంశాల్లో అందరి భాగస్వామ్యంతో సంక్షేమానికి ప్రభుత్వం ముంద డుగు వేస్తుందన్నారు. మహాలక్ష్మీ పథకంలో ఉచిత ప్రయా ణం ద్వారా 3,63,4000 మంది మహిళలకు 151 కోట్ల 90 లక్షల రూపాయల లబ్ధి చేకూరిందన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా 32130 మంది పేదల చికిత్సలకు 54కోట్ల27 లక్షల రూపాయలను వెచ్చించామన్నారు. గృహ జ్యోతి పథకంలో 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించామన్నారు. రుణ మాఫీ ద్వారా 64452 మంది రైతులకు 540 కోట్ల రూపా యల రుణమాఫీ చేశామన్నారు. రైతు బీమా పథకంలో 14 కోట్ల 20 లక్షలను చెల్లించామన్నారు. చేయూత పింఛన్లు జి ల్లాలో 92,470 మంది లబ్ధిదారులకు 21కోట్ల 30 లక్షలను ప్రతీ నెల పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు 10, 320 ఇళ్లు మంజూరు కాగా 8,514 ఇళ్లు గ్రౌండింగ్‌ చేయ బ డ్డాయని, 2,456 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. జిల్లాలో 2,57,251 రేషన్‌ కార్డుల ద్వారా 14,502 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, నూతనంగా 40, 465 రేషన్‌ కార్డులు జారీ చేసి 2,56, 175 స్మార్ట్‌ రేషన్‌ కా ర్డులను పంపిణీ చేసి బియ్యం అందిస్తున్నామన్నారు. ప్ర భుత్వ పాఠశాలల్లో 45,542 మంది విద్యార్థులను చేర్పించి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్ధానంలో నిలిచిందన్నారు. కళ్యా ణలక్ష్మీ, షాదిముబారక్‌ ద్వారా 36590 మంది లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మంచిర్యాలలో జనావాసాల్లోకి నీరు రాకుండా 213 కోట్లతో కరకట్ట నిర్మాణం చేపడుతు న్నామన్నారు. అనంతరం జిల్లాలోని ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందించారు. ఏఆర్‌ ఏసీపీ రమేష్‌, సం పత్‌ల నేతృత్వంలో నిర్వహించిన పోలీసు కవాతు, గౌరవ వందనం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్‌లు రాములు, చంద్రయ్య, కనీస వేతనాల చైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌, సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, డీసీపీ భాస్కర్‌, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, ఏసీపీ ప్రకాష్‌, డీఎంహెచ్‌వో నరేందర్‌రా థోడ్‌, కృష్ణమూర్తి, ఎస్పీ కార్పొరే షన్‌ ఈడీ దుర్గా ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 12:04 AM