Share News

విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రజాపోరు

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:09 PM

దేశ ప్రజలకు విద్య, వైద్యం, ఉ పాధి అందించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాపోరు యాత్ర చేప ట్టినట్లు ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య అన్నారు. గురువారం ప్రా రంభమైన యాత్ర 14వ తేదీ వరకు మంచిర్యాల నియోజకవర్గంలో కొన సాగనుంది.

విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రజాపోరు
ప్రజా పోరు యాత్రలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య

ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య

శ్రీరాంపూర్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : దేశ ప్రజలకు విద్య, వైద్యం, ఉ పాధి అందించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాపోరు యాత్ర చేప ట్టినట్లు ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య అన్నారు. గురువారం ప్రా రంభమైన యాత్ర 14వ తేదీ వరకు మంచిర్యాల నియోజకవర్గంలో కొన సాగనుంది. యాత్ర శుక్రవారం కృష్ణకాలనీకి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌ అధిక ధరలను ప్రజలపై మోపిందన్నారు. బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా చట్టాలు తీసు కువ స్తూ రైతులు, కార్మికులకు నష్టం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. వి ద్యార్థులు, యువత పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. ఆయా సమ స్యలపై ప్రజలను చైతన్యపరిచి మోడీని గద్దె దించేందుకు వచ్చే నెల 1న చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పోరుయాత్ర లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్య క్ర మంలో సీపీఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ స భ్యులు కందికట్ల వీరభద్రయ్య, రేగుంట చంద్రశేఖర్‌, లింగం రవి, జిల్లా సమితి సభ్యులు ఎస్‌కే బాజీసైదా, మిర్యాల రాజేశ్వర్‌ రావు, కొత్తపల్లి మ హేష్‌, మొగిలి లక్ష్మణ్‌, దేవి పోచన్న, బాలసాని లక్ష్మణ్‌, దుర్గయ్య, కొమ్ము రవి, గడప రవి పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 11:10 PM