Share News

కోపాలు తగ్గించుకుంటేనే శాంతియుత వాతావరణం

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:28 PM

ప్రజలు కోపతాపాలకు లో నుకాకుండా ప్రశాంత వాతావరణంలో జీవిస్తే ఎలాంటి నేరాలు జరిగే అవకాశాలు ఉండవని హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేశ్‌ తెలిపారు. కేసుల సత్వర పరిష్కారానికి మందమర్రిలో కోర్టు ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం అందించిన సహకారం మరువలేనిదన్నారు.

కోపాలు తగ్గించుకుంటేనే శాంతియుత వాతావరణం

ఫహైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేశ్‌

మందమర్రిటౌన్‌, ఆగస్టు22 (ఆంధ్రజ్యోతి): ప్రజలు కోపతాపాలకు లో నుకాకుండా ప్రశాంత వాతావరణంలో జీవిస్తే ఎలాంటి నేరాలు జరిగే అవకాశాలు ఉండవని హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేశ్‌ తెలిపారు. కేసుల సత్వర పరిష్కారానికి మందమర్రిలో కోర్టు ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం అందించిన సహకారం మరువలేనిదన్నారు. పట్టణంలోని టీవైఎస్‌ఎఫ్‌ బ్యారెక్‌ 80లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కోర్టు ప్రారం భోత్సవానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందు గా పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కోర్టు భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు ఏర్పాటు వలన ఈ ప్రాంతంలో కేసుల పరిష్కారానికి మోక్షం లభిస్తుందన్నారు. ఇగోలకు వెళ్లకుండా సామరస్యంగా ఉంటే శాంతిభద్రతల సమస్య ఏర్ప డదన్నారు. దేశంలో మూడున్నర కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నా రు. కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ మాట్లాడుతూ ప్రజలు పట్టింపులకు పోకుండ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు సామరస్యంగా కూర్చుని మాట్లాడితే పరి ష్కరించుకోవచ్చునన్నారు. జిల్లా జడ్జి వీరయ్య మాట్లాడుతూ మందమర్రి కోర్టు ఏర్పాటు వల్ల జిల్లా నుంచి 2,727పైగా కేసులను బదిలీ చేశామ న్నారు. ఆయా కేసులకు సంబంధించి ఈ కోర్టులో పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు కోర్టు ఇన్‌చార్జి జడ్జి నిరోష వారికి స్వాగతం పలికారు. ఈ క్యాక్రమంలో సీపీ అంబర్‌ కిషోర్‌ ఝూ, మం చిర్యాల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సత్యనారాయణ, మందమర్రి ఏరి యా జీఎం రాధాక్రిష్ణ, మందమర్రి బార్‌ అసోసియేసన్‌ సభ్యులు చిరం జీవ చారి, రాజన్న,నాగేందర్‌, రంజిత్‌, సత్యం తదిరులు పాల్గొన్నారు

బెల్లంపల్లిలో నూతన భవనం ప్రారంభం

బెల్లంపల్లి : మండలంలోని కన్నాల జాతీయ రహదారి పక్కన నూతనంగా రూ.4.50 కోట్లతో నిర్మించిన జూనియర్‌ సివిల్‌ కోర్టు భవ నాన్ని హైకోర్టు న్యాయమూర్తి నగేష్‌ భీమపాక శనివారం ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తికి జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి శాంతిసోనితో పాటు న్యాయవాదులు ఘనంగా స్వాగతం పలికారు. న్యాయమూర్తి పో లీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. భవనం ప్రారంభించిన అనంత రం ఆయన కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి వీరయ్య, సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, ఏసీపీ కిరణ్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:28 PM