Share News

కరువు జిల్లా కోసం పోరుబాట

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:22 AM

జిల్లాను మొత్తంగా కరువు ప్రాంతంగా గుర్తించాలనే డిమాండ్‌ బలంగా వస్తోంది. అన్ని రాజకీయ పక్షాలు ఇదే డిమాండ్‌తో ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్ని మండలాల్లో పంటలకు చివరి తడికి నీరందక అన్నదాతలు నష్టపోతున్నారు. భూగర్భజలాలు అడుగంటి రాబోయే రోజుల్లో తాగునీటికి తంటాలు పడాల్సిన పరిస్థితి వస్తుందని

కరువు జిల్లా కోసం పోరుబాట

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాను మొత్తంగా కరువు ప్రాంతంగా గుర్తించాలనే డిమాండ్‌ బలంగా వస్తోంది. అన్ని రాజకీయ పక్షాలు ఇదే డిమాండ్‌తో ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్ని మండలాల్లో పంటలకు చివరి తడికి నీరందక అన్నదాతలు నష్టపోతున్నారు. భూగర్భజలాలు అడుగంటి రాబోయే రోజుల్లో తాగునీటికి తంటాలు పడాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభుత్వమే ప్రకటనలు చేస్తోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం జిల్లాలోని మూడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా గుర్తించడంతో మిగతా మండలాల్లో రైతులు ఆందోళన వ్యక ్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఈ నిర్ణయాన్ని అశాసీ్త్రయమైనదని, ప్రభుత్వం మళ్లీ సర్వే నిర్వహించి కరువు మండలాల ప్రకటన చేయాలని ఇప్పటికే డిమాండ్‌ చేశారు. జిల్లాను మొత్తంగా కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఎల్‌నినో వల్ల తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో దీనిని కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ డిమాండ్‌ చేస్తోంది. ఈనెల 10న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌ నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన నాయకుల బృందం మంగళవారం జిల్లాలోని మోతె గ్రామంలో పర్యటించి కరువు పరిస్థితులను, రైతులను సంప్రదించి అధ్యయనం చేసింది.

ఫ ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయం

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి ఇబ్బందులు, విద్యుత సమస్యలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. గతంలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు అందిన ప్రయోజనాలను, ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయాలని భావిస్తున్న ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ నేతృత్వంలో నవంబరు 11 నుంచి 14 మధ్య రెండురోజుల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.

కరువు మండలాల విషయంలో పునరాలోచన చేసి మళ్లీ సర్వే నిర్వహించి జిల్లాను మొత్తంగా కరువుప్రాంతంగా ప్రకటించక పోతే ఆందోళనలు నిర్వహిస్తామని బీజేపీ ఇప్పటికే హెచ్చరించింది.

ఫ మంత్రులు స్పందించాలంటున్న జిల్లావాసులు

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు మాత్రం కరువు మండలాల విషయంలో నోరెత్తడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రజల నుంచి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్‌ వస్తున్నా స్పందించడం లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాత్రం కరీంనగర్‌ జిల్లా పరిధిలో ఉన్న తన హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంతరెడ్డికి లేఖ రాశారు. కరీంనగర్‌ జిల్లావాసిగా, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇనచార్జిగా వ్యవహరిస్తూ అన్ని రాజకీయాల్లో జిల్లా మంత్రిగానే ప్రధాన భూమిక పోషిస్తున్న ఆయన కేవలం తన నియోజకవర్గ పరిధిలోని మండలాలకు మాత్రమే పరిమితం కావడాన్ని ఆక్షేపిస్తున్నారు. జిల్లా ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్ళి కరువు జిల్లాగా ప్రకటించేందుకు కృషిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 04 , 2026 | 01:22 AM