kumaram bheem asifabad-‘ఉపాధి’కి కొత్తరూపు
ABN , Publish Date - Mar 28 , 2026 | 10:26 PM
నిరుపేదలకు పనుల కల్పించడమే లక్ష్యంగా గత యూపీఏ ప్రభుత్వం రూపకల్పన చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్తరూపు దిద్దుకోబోతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్- గ్రామీణ్‌గా (వీబీజీరామ్‌జీ)గా మార్చి కొత్త చట్టం చేసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న మార్పుల్లో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ కూడా కొత్త నిబంధనలకు అనుగుణంగా గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. గతంలో కుటుంబానికి 100 రోజుల పాటు తప్పనిసరిగా పనులు కల్పించాలన్న నిబంధన ఉంది.
- ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నుంచి వీబీజీ రామ్‌జీగా అమలు
- కొత్త ప్రణాళికకు గ్రామీణాభివృద్ధి సంస్థ సిద్ధం
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు పనుల కల్పించడమే లక్ష్యంగా గత యూపీఏ ప్రభుత్వం రూపకల్పన చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్తరూపు దిద్దుకోబోతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్- గ్రామీణ్‌గా (వీబీజీరామ్‌జీ)గా మార్చి కొత్త చట్టం చేసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న మార్పుల్లో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ కూడా కొత్త నిబంధనలకు అనుగుణంగా గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. గతంలో కుటుంబానికి 100 రోజుల పాటు తప్పనిసరిగా పనులు కల్పించాలన్న నిబంధన ఉంది. ఇప్పుడు 125 రోజులు గ్యారంటీ ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు కేటాయించేంది. కాగా ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ పథకం అమలు కాబోతోంది. 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రా లు భరించనున్నాయి. కాగా గతంలో 15 రోజుల్లో ఉపాధి కూలీలకు సొమ్ములు చెల్లించే పద్ధతి ఉంది. ఇప్పుడు వారానికి ఒకసారి డబ్బులు చెల్లించే కార్యక్రమం చేపడుతు న్నారు.
- హాజరు నమోదుకు..
ఉపాధి హామీ కూలీల హాజరు నమోదుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం ఎంఎంఎస్ యాప్‌ను తీసుకొచ్చారు. ఈ విధానం వచ్చిన తరువాత వేతనదారులకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో తప్పసరిగా ఫొటో మస్టర్( ఫెషియల్ అటెండెన్స్) వేయాలి. ఇక ఏప్రిల్ నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి వీబీజీ రామ్‌జీకి అను సంధానం చేయనున్నారు. కార్డుదారులను ఈకేవైసీ యాప్‌లో ఉపాధి జాబ్‌కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయనున్నారు. అలాగే ఉపాధి హామీ కూలీల వేలిముద్రలు, కళ్లను ఐరీష్ ద్వారా సేకరించనున్నారు. ప్రతిరోజు పనికి వెళ్లినపుడు ఐరీష్ ద్వారా బయోమెట్రిక్ హాజరుతో పాటు మధ్యాహ్నం కూలీలతో గ్రూప్ ఫొటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ జాబ్ కార్డులు 1,22లక్షలు ఉండగా, 1.61లక్షల మంది కూలీలు పని చేస్తున్నారు. క్రియాశీలకంగా ఉన్న కార్డులు 88వేలు, మొత్తం కూలీలు 2.39 లక్షలమంది ఉన్నారు. ఇందులో ఎస్సీలు 16.21శాతం, ఎస్టీలు 36.87శాతం మంది కూలీలు ఉన్నారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతు న్న వీబీజీ రామ్ జీ పథకం ద్వారా పలు మార్పులు రాబోతున్నాయని జిల్లా గ్రామీణాభి వృద్ధిశాఖ అధికారి దత్తారావు తెలిపారు.