’ఎల్’ మడుగుకు మహర్దశ...?
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:26 PM
జైపూర్ మండలం శివ్వారం గ్రామంలోని ’ఎల్’ మడుగుకు మ హర్దశ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-పర్యాటక ప్రాంతంగా మొసళ్ల అభయారణ్యం
-దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని వైనం
-మంత్రి వివేక్ హామీతో చిగురిస్తున్న ఆశలు
-పక్షిజాతులు, వణ్య ప్రాణులకు ఆవాసం
మంచిర్యాల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జైపూర్ మండలం శివ్వారం గ్రామంలోని ’ఎల్’ మడుగుకు మ హర్దశ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద హామీ ఇవ్వడంతో మొసళ్ల అభయారణ్యం అభివృద్ధిపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నా యి. టూరిజం సర్క్యూట్‌లో అభివృద్ధికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హామీ లు ఇచ్చినప్పటికీ అవి కార్య రూపం దాల్చకపోవడంతో పర్యాటకులు తీవ్ర అసంతృ ప్తితో ఉన్నారు. జైపూర్ మండలం కుందారం నుంచి చెన్నూరు మండలంలోని బీరెల్లి వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న గోదావరి నదిలోని మడుగు (ఎల్ మడుగు) మొసళ్లకు ఆవాసంగా ఉంది. నదితోపాటు దాని చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాన్ని అ టవీశాఖ మొసళ్ల అభయా రణ్యంగా గుర్తించింది. మం చిర్యాల-పెద్దపల్లి జిల్లా మంథని మధ్యలో రెండు కొండ ల నడుమ విస్తరించిన గోదావరి అందాలొలుకుతూ చూపరులను ఇట్టే ఆకర్శిస్తోంది. 1978లో పుష్పకుమార్ అనే వైల్డ్ లైఫ్ నిపుణుడు ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి ముగ్దుడై అభయార ణ్యం, జీవజాతులపై అధ్యయనం చేసి అప్పటి ప్రభు త్వానికి నివేదికలు అందజేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని మొసళ్ల పునరావాస కేంద్రంగా పిలుస్తు న్నారు. ఎల్ మడుగులో 50కి పైగా ఉప్పు, మంచినీటి మొసళ్లు ఉండగా, అటవీశాఖ ఆధ్వర్యంలో సంక్షణ చర్యలు చేపడుతున్నారు.
ఉట్టి పడుతున్న పూర్వవైభవం...
పురాతనమైన ఈ మొసళ్ల అభయారణ్యానికి కాక తీయ రాజులు వరంగల్ నుంచి పెద్దపల్లి జిల్లా మీదుగా శివ్వారం వరకు దారి ఏర్పాటు చేసినట్లు చరి త్రకారులు చెబుతుంటారు. అప్పట్లో మునీశ్వరులు కూ డా నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఆనవాళ్లు ప్రస్తుతా నికీ పదిలంగా ఉన్నాయి. జైపూర్ మండలం కేంద్రం నుంచి 28 కిలోమీటర్ల దూరంలో శివ్వారం మొసళ్ల అ భయారణ్యం ఉంది. ఎల్ మడుగు ఒడ్డున ఉన్న ఓ గు హ దాదాపు 250 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇవి మానవ నిర్మిత గుహలు. ఇందులోని ఒక గుహలో ఇ సుక రాతితో చెక్కిన ఎత్తయిన పానపట్టంతో శివలిం గం ఉంది. ఇక్కడ కనిపించే నాలుగు గుహాలయాలు బ యటకు ద్వార స్తంబాలుగా, లోపల రాతి గద్దెలతో ని ర్మించిన దేవాలయాలను తలపిస్తుండగా, దీపాల గూ డులతో, మలుపు తిరిగిన రాతి గోడలతో చదునైన రాతి నేతలతో బౌద్దుల ’వస్సావాసా’ (వర్షాకాలంలో బౌద్ద భి క్షువులు నివసించే తాత్కాలిక ఆవాసాలు)ను తలపి స్తాయి. గుహలున్న ప్రదేశంలోనే లభించిన ముతక ఇ టుకలు శాతవాహన కాలానికి చెందినవని చరిత్రకారు లు చెబుతున్నారు. ఒక ద్వారం పక్కన గుర్రం మీద స్వారీ చేస్తున్న జంట శిల్పం కనువిందు చేస్తుంది. ద్వా రా స్తంభాల మీద పెట్టిన బ్రాకెట్లు, స్తంభాల శిల్పం పురాతన శైలిని ప్రతిబింబిస్తోంది. గుహల బయట కని పిస్తున్న ప్రదేశంలో చక్కగా చెక్కిన రాతి స్తంబాలు, రా తి ఇటుకలు, రాతి గడీలు పరిచి ఉన్నాయి. గుహలు, గుహల బయట చక్కని ప్రణాళికతో నిర్మించిన నివా సాలు, ఆరామాలు కనిపిస్తున్నాయి. ఈ నాలుగు గుహ లు క్రీ.పూ. 1,2 శతాబ్దాల నాటివని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు.
వణ్య సంపదకూ నిలయం...
మొసళ్ల అభయారణ్యం ఎన్నో రకాల అటవీ సంప దకు నిలయం. ఇక్కడ ఎన్నో వృక్ష, పక్షి, జంతుజాతులు ఉన్నాయి. చుక్కల దుప్పులు, నీలుగాయిలు, నీటి పి ల్లులు, అడవిపందులు, ముళ్ల పందులు, జింకలు, కొం డ గొర్రెలు, నీటి కుక్కలు వంటి జంతుజాతులు ఇక్కడ నివసిస్తున్నాయి. నెమళ్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్న ట్లు అధికారులు చెబుతున్నారు. వృక్ష సంపదలో నల్లమ ద్ది, చెన్నెంగ, బూరుగు, అందుగు, కొడిశ, పాలవంటి అరుదైన వృక్షజాతులు ఉన్నాయి. యేటా ఇక్కడకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. ఎండాకాలం కూడా ఇక్కడ నీరు ఎండిపోకుండా ఉండటంతో చాలా మంది కుటుంబాలతో కలిసి సందర్శిస్తుంటారు. పర్యాటకులు నదిలో షికారు చేసేందుకు బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం అది పనిచేయడం లేదు. అయి తే ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కనుల విందు చేసే పర్యాటక ప్రాంతం ప్రస్తుతం ఆలనా పాలనలేక కళావిహీనంగా దర్శనమిస్తోంది. టూరిజం సర్య్కూట్‌లో భాగంగా అభి వృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా మొసళ్ల అభయారణ్యాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న దశలో మంత్రి వ్యాఖ్య లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గోదావరి పుష్కర పనుల్లో భాగంగా చెన్నూరు ఘాట్‌కు భూమిపూజ కా ర్యక్రమం సందర్భంగా ఈ నెల 15వ తేదీన మంత్రి వివేకానంద శివ్వారం మొసళ్ల మడుగు ప్రాంతాన్ని అ భివృద్ధి చేసి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పర్యావరణ ప్రేమికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర పర్యా టక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావే జిల్లా ఇంచార్జి మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తుండటం, మరో మంత్రి గడ్డం వివేకానంద సొంత నియోజక వర్గం చెన్నూరు పరిధిలోనిది అయినందున మొసళ్ల అభయారణ్యంపై ప్రత్యేక చొరవ తీసుకుంటారనే ఆశాభావంలో పర్యావర ణ ప్రేమికులు ఉన్నారు.