Share News

kumaram bheem asifabad- ఉజ్వల భవితకు నవోదయం

ABN , Publish Date - Jul 18 , 2026 | 10:59 PM

ప్రతిభ ఉన్న చదువుకోలేనిగ్రామీణ విద్యార్ధుల జీవితాల్లో జవహర్‌ నవోదయ విద్యాలయం వెలుగులు నింపుతోంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునాతన విద్యను ఉచితంగా అందంచడంతో పాటు ఈ పాఠశాల ప్రత్యే కత. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త కోర్సులను, సాంకేతిక అంశాల్ని విద్యార్థులకు చేరువ చేస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అవసరమైన జేఈఈ, ఐఐటీ, నీట్‌, బిట్స్‌ లాంటి పరీక్షలకు ఉచితం గా శిక్షణ ఇస్తూ విజేతలుగా నిలుపుతోంది

kumaram bheem asifabad- ఉజ్వల భవితకు నవోదయం
లోగో

- వచ్చే ఏడాది ప్రవేశాలకు నోటిఫికేషన్‌

- నెలాఖరులోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆహ్వానం

కాగజ్‌నగర్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ప్రతిభ ఉన్న చదువుకోలేనిగ్రామీణ విద్యార్ధుల జీవితాల్లో జవహర్‌ నవోదయ విద్యాలయం వెలుగులు నింపుతోంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునాతన విద్యను ఉచితంగా అందంచడంతో పాటు ఈ పాఠశాల ప్రత్యే కత. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త కోర్సులను, సాంకేతిక అంశాల్ని విద్యార్థులకు చేరువ చేస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అవసరమైన జేఈఈ, ఐఐటీ, నీట్‌, బిట్స్‌ లాంటి పరీక్షలకు ఉచితం గా శిక్షణ ఇస్తూ విజేతలుగా నిలుపుతోంది. ప్రతిభావంతులైన నిరూపేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ వారి లక్ష్య సాధనకు దోహద పడుతోంది. విజ్ఙానజ్యోతి లాంటి కార్యక్రమాలతో బాలికల విద్యన్నోతికి బాసటగా నిలుస్తోంది. 6 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో విద్యాబోధన అందిస్తోం ది. ఈ నెలాఖరులోగా విద్యార్థులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

గ్రామీణ ప్రాంతాల వారికి..

నవోదయ విద్యాలయంలో గ్రామీణ ప్రాంతాల వారికి ప్రాధాన్యం ఇస్తారు. కాగజ్‌నగర్‌లోని త్రిశూల్‌పహాడ్‌ గుట్ట సమీపంలో 30 ఎకరాల విస్తీర్ణం, ఆహ్లాదకర వాతావరణంలో 30 మంది అధ్యాపకులు, మరో 30 మంది సిబ్బందితో నవోదయ కొనసాగుతోంది. ఇక్కడ విద్యను అభ్యసించిన ఎంతో మంది నేడు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా ఇక్కడ విద్యాభోధన ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ కావడంతో ఎక్కువ మంది విద్యార్ధులు జేఈఈ అడ్వాన్సు, జేఈఈ మెయిన్స్‌, నీట్‌ లాంటి అనేక పోటీ పరీక్షల్లో రాణిస్తున్నారు. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా అత్యుత్తమ విద్య అందుతుంది. డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తూ 500 మంది విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తున్నారు. అంతేకాక అత్యుత్తమ కంప్యూటర్‌ ల్యాబ్‌, ఆధునాతన ప్రయోగశాలలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తున్నారు. ఇంతటి మహాత్తర నవోదయాలో సీటు సంపాదించడం ఆషామాషీ కాదు. ఏటా పదివేల మందికిపైగా పోటీ పడుతారు. వారిలో కేవలం 80 మందికి మాత్రమే ప్రవేశం దొరుకుతుంది. గ్రామీణ విద్యార్థులకు 75 శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం, విద్యార్థినిలకు 33 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. ఆరోతరగతి ప్రవేశానికి నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే ప్రవేశ పరీక్షకు విద్యార్థుళు పలు అర్హతలు తప్పకుండా కలిగి ఉండాలి. 2026-27 విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదివి ఉండాలి. మూడు, నాలుగు, తరగతులు కూడా ఇదే ఉమ్మడి జిల్లాలో చదివి ఉండాలి. 01-05-2015 నుంచి 31-07-2017 మధ్య కాలంలో జన్మించి ఉండాలి.

విద్యార్థులకు నాణ్యమైన విద్య..

-కొడాలి పార్వతి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌

నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాం. 2027-28 విద్యా సంవత్సరానికి గానూ నవోదయంలో 80 సీట్లలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవలసి ఉంటుంది. విద్యర్థుల తల్లిదండ్రులు గమనించి ఈ నెల 31 వరకు దరఖాస్తులు చేసుకొని ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం చేయాలి.

Updated Date - Jul 18 , 2026 | 10:59 PM