Share News

యాదగిరికొండపై నూతన సందడి

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:16 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నూతన సంవత్సర సందడి నెలకొంది. ఇష్టదైవాల దర్శించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.

యాదగిరికొండపై నూతన సందడి
భక్తులు

యాదగిరిగుట్ట, జనవరి 1(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నూతన సంవత్సర సందడి నెలకొంది. ఇష్టదైవాల దర్శించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. దీంతో కొండపైన బస్టాండు ప్రాంగణం, కింద బస్టాండ్‌, పార్కింగ్‌ ప్రదేశాలు వాహనాలతో నిండిపోయాయి. అలస్యంగా వచ్చిన బస్సుల్లో సీట్ల కోసం భక్తులు ఇబ్బందులు పడ్డారు. కొండకింద బస్టాండు, కొండకింద రామానుజ, ప్రహాల్లాద సర్కిళ్ల వద్ద భక్తులు బస్సుల కోసం నిరీక్షించారు. కల్యాణకట్టలో భక్తులు తలనీ లాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక దర్శనానికి గంట, ధర్మదర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఉదయం, సాయంత్రం బ్రేక్‌ దర్శనాలు, మధ్యాహ్నం (ఆరగింపు) సమ యంతో కలిపి సుమారు మూడు గంటల పాటు భక్తులు ఉభయ క్యూలైన్లల్లోనే వేచి ఉన్నారు. క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్లు, తిరువీధులు, ప్రాకార మండపాలు భక్తులతో ఉదయం నుంచి రాత్రి వరకు సందడిగా మారాయి. సుమారు 50 వేల మంది భక్తులు తరలివచ్చారు. బ్యాటరీ వాహనాల ద్వారా వృద్దులు, చంటి పిల్లల తల్లులు, మహిళలు, దివ్యాంగులను లిఫ్ట్‌ ద్వారా తూర్పు తిరువీధికి తరలివెళ్లారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ. రూ.56,42,867ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎస్‌. వెంకట్రావు తెలిపారు.

శాస్ర్తోక్తంగా నిత్య పూజలు

సుప్రభాత సేవతో స్వామి అమ్మవారలను మేల్కొల్పిన అర్చకులు నిత్య పూజలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. గర్భాలయంలో స్వయం భువులకు అభిషేకం పర్వాలు వైభ వంగా నిర్వహించారు. పాతగుట్టలోనూ స్వామి అమ్మ వారికి నిత్య పూజలు నిర్వహించారు. శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామికి నిత్య పూజలు, రుద్రహవన పూజలు, శైవాగమరీతిలో నిర్వహించారు. రాత్రి మహాని వేదన, శయనోత్సవాలతో ఆలయ ద్వార బంధనం చేశారు.

తిరువేంకటపతిగా నృసింహుడు

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడు శ్రీరాముడు, తిరువేంకటపతిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి ఉదయం దివ్య ప్రబంద పారాయణాలు చేయగా రామవతారంలో ద్రావిడ ప్రబంద సేవ పారాయణీకుల పారాయణాలతో యాదగిరీశుడు మూడో రోజు ఆధ్యయనోత్సవాల్లో బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలతో తిరువీధుల్లో ఊరేగుతూ నేత్రానందం కలిగించారు. ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, భట్టర్‌ సురేంద్రాచార్యులు అర్చక బృందం పండితులు, పారాయణీకుల వేద మంత్రాలు, ఆస్థాన విద్యాంసుల మంగళవాయిద్యాల నడుమ పాంచరాత్రాగమరీతిలో వైభవంగా నిర్వహించారు. నిత్య ఆరాధనల అనంతరం ఉదయం, సాయంత్రం ప్రత్యేక అలంకరణలతో భక్తులు దర్శించుకున్నారు. ఊరేగుతూ పండితులు దివ్యప్రబంద పారాయణాల నడుమ భక్తులకు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమాల్లో అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి, ఆలయ డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవో గజ్వేల్లి రఘు పాల్గొన్నారు.

గుట్ట ఆలయ ప్రధానార్చకుడిగా వెంకటాచార్యులు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధానార్చకుడిగా కాండూరు వెంకటాచార్యులు నియమితులయ్యారు. ఆయనను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టారు.

Updated Date - Jan 02 , 2026 | 12:16 AM