Share News

సత్యదేవుడి సన్నిధిలో భక్తజన సందోహం

ABN , Publish Date - Nov 14 , 2026 | 11:24 PM

కార్తీక మాస పంచమి, కార్తీక మాస వేళ గూడెంగుట్ట భక్తిభావంతో పరవశించింది. దం డేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయ ణస్వామి దేవస్థానానికి శనివారం పెద్ద ఎత్తు న భక్త్తులు తరలివచ్చారు. జిల్లాతో పాటు ఇ తర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు కుటుంబసమేతంగా తరలివచ్చారు.

సత్యదేవుడి సన్నిధిలో భక్తజన సందోహం

కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం..

దండేపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాస పంచమి, కార్తీక మాస వేళ గూడెంగుట్ట భక్తిభావంతో పరవశించింది. దం డేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయ ణస్వామి దేవస్థానానికి శనివారం పెద్ద ఎత్తు న భక్త్తులు తరలివచ్చారు. జిల్లాతో పాటు ఇ తర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు కుటుంబసమేతంగా తరలివచ్చారు. సత్యదే వుడిని భక్తిశ్రద్ధలతో భక్తులు పూజించి మొ క్కులు చెల్లించి, ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. పవిత్ర కార్తీక మాసం సందర్బంగా వందలాది మంది భక్తులు కుటుంబసమేతంగా సామూహిక వ్రతాలను ఆచరించారు. స్వామి దర్శనం కోసం క్యూలైన్‌ లో బారులు తీరి సత్యదేవుడిని దర్శించుకు న్నారు. ఉదయం నుంచి భక్తులు రావడంతో ఆలయ ప్రాంగమంత భక్తులతో కిటకిటలాడ గా, కార్తీక వ్రతాలను ఆచరించేందేందుకు భ క్తులు వ్రత మండపల వద్ద భారీగా బారులు తీరారు. దీంతో గూడెం ఆలయ పరిసర ప్రాం తమంతా భక్తజనంతో కార్తీక శోభతో సందడి గా మారి గూడెంగుట్ట ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది. సత్యదేవుడి సన్నిధిలో వ్ర తాలు ఆచరించడం విశేష పుణ్యప్రదమని భ క్తులు విశ్వసిస్తూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నా రు. వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు త లెత్తకుండా ఆలయం వద్ద అన్ని ఏర్పాటు చేసి ఆలయ ఈవో శ్రీసివాస్‌, ఆలయ పర్యవే క్షకులు శ్రీనివాస్‌గౌడ్‌లు పర్యవేక్షించారు.

Updated Date - Nov 14 , 2026 | 11:24 PM