పీఎస్సార్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేయాలి
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:08 PM
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుపై అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేయా లని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డు అడిషనల్ డీజీపీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుపై అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేయా లని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డు అడిషనల్ డీజీపీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు రూ. 470 కోట్లు బ్యాంకులకు చెల్లింపుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగు తోందన్నారు. అవినీతి, అక్రమాలు చేయడం, భవనాలను కూల్చివేయడం, ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న ఎమ్మెల్యేపై సీఎం రేవంత్‌రెడ్డి వే డుక చూడడం సిగ్గు చేటన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ట్రిబ్యున ల్ వేసి అవినీతికి సహకరిస్తున్న వారిపై శిక్షిస్తామన్నారు. సామాన్యుడు లోన్ అడిగితే నిబంధనలు చెప్పే బ్యాంకు అధికారులు అవినీతి కొమ్ముకా స్తున్న ప్రేంసాగర్‌రావుకు కొన్ని కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అంత కుముందు నడిపెల్లి విజిత్‌కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎమ్మెల్యే అవినీతిని సాక్ష్యాలతో వివరిం చారు. ఆయన మాట్లాడుతూ బ్యాంకు గ్యారంటీ, ఓవర్ డ్రాప్ట్ రూపంలో ఒక్క రూపాయి కట్టని వ్యక్తి ఏకంగా సంవత్సర్నర కాలంలో రూ. 444 కో ట్లు అప్పులు ఎలా చెల్లించారనేది ప్రజలకు చెప్పాలన్నారు. ఎమ్మెల్యే అ క్రమాలపై సీబీఐకి లేఖ రాస్తామన్నారు. సీఎం వెంటనే స్పందించి ఎమ్మె ల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయ కులు గాదె సత్యం, లక్ష్మణ్, నరేష్, రవిందర్‌రెడ్డి పాల్గొన్నారు.